తిరుపతి వశిష్ట ఆశ్రమంలో ఘోరం జరిగింది. అర్చకుడి ఆత్మహత్య కలకలం రేపింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, శ్రీనివాసమంగాపురం సమీపంలోని శ్రీ లలితా పీఠం వశిష్ట ఆశ్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాశీలో అర్చకత్వం చేసిన ఆయన యాడాది క్రితమే ఆశ్రమంలో విధుల్లో చేరాడు. ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.శ్రీనివాసమంగాపురంలోని శ్రీ లలితా పీఠం వశిష్ట ఆశ్రమంలో ప్రధాన అర్చకుడు టంకు ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడడం వివాదాస్పదం అవుతోంది. శ్రీ స్వరూపానందగిరి ఆధ్వర్యంలో నడపబడుతున్న శ్రీ విశిష్ట ఆశ్రమంలో నేపాల్ కు చెందిన 22ఏళ్ల టంకు ప్రసాద్ ప్రధాన అర్చకుడుగా విధులు నిర్వహిస్తున్నాడు.
కాశీలో అర్చకత్వం చేసిన ప్రసాద్ ఏడాది క్రితమే 15వేల రూపాయల జీతంతో ఆశ్రమంలో ప్రధాన అర్చకుడిగా విధుల్లో చేరాడు. రాత్రి ఆలయం తలుపులు మూసి గదికి వెళ్లి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టంకు ప్రసాద్ కు నేపాల్ కు చెందిన ఓ యువతి ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మరి కుటుంబ సభ్యులు వీరి ప్రేమకు అంగీకరించలేదా… లేక యువతి నిరాకరించిందా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడు ప్రసాద్ హిందీలో రాసిన లెటర్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొద్ది రోజులుగా అతని సెల్ ఫోన్ వాట్సాప్ స్టేటస్ లో విషాద గీతాలు అప్ లోడ్ చేస్తూ వస్తున్నాడు ప్రసాద్. ఈసమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎస్వీ మెడికల్ కాలేజ్ కు తరలించారు. మృతుని బంధువులకు సమాచారం అందించారు. వారిని విచారించిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.
CM Jagan Mohan Reddy: ప్రభుత్వ పాఠశాలలో ప్రతి క్లాసులో డిజిటల్ బోధన