ఏపీ ప్రభుత్వం కొత్తగా పెళ్లి చేసుకున్నవారికి ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయింది. పేద కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద శుక్రవారం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగదు జమ చేయనున్నారు.
విశాఖ బీచ్‌లో శ్వేత అనే మహిళ మృతదేహం కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. విశాఖ బీచ్‌లో యువతి మృతదేహం కేసులో పోస్టుమార్టం రిపోర్టులో ఏముందనేది ఆసక్తిగా మారింది. ఆర్కే బీచ్‌లో శ్వేత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. విశాఖ మూడో పట్టణ పోలీసులు, రెవెన్యూ అధికారులు శ్వేత మృతదేహానికి శవ పంచానామా నిర్వహించారు.
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్.జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్పందన, జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం, నాడు – నేడుపై సీఎం సమీక్షించారు.
సీఎం కాన్వాయ్‌ను రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయడం పక్కా ప్లాన్‌తో జరిగిందని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. తుంపర్తి, మోటమర్ల వద్ద భూసేకరణ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని.. అప్పట్లో ఎకరాకు 5 లక్షల పరిహారంగా నిర్ణయించి ఆ డబ్బు కోర్టులో డిపాజిట్ చేశారన్నారు.
టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. చంద్రబాబు సత్తెనపల్లి సభ అట్టర్‌ఫ్లాప్ అయిందని కామెంట్స్ చేశారు. కానీ ప్రచారం మాత్రం ఆర్భాటంగా చెప్పుకున్నారన్నారు. సత్తెనపల్లి సభకు జనం రాకపోయినా అద్భుతం అనడం చంద్రబాబు ఖర్మ అంటూ విమర్శలు గుప్పించారు.
వివేకా చనిపోయిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆరోజు ఎం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. ఆ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలను అవినాష్ రెడ్డి చెప్పారు.
భగీరథ మహర్షి జయంతి సందర్బంగా క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా భగీరథ మహర్షి చిత్రపటానికి ముఖ్యమంత్రి జగన్ నివాళులు అర్పించారు