YS Avinash Reddy: వివేకా చనిపోయిన రోజు ఏం జరిగిందంటే.. సంచలన వీడియో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Avinash Reddy: వివేకా చనిపోయిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆరోజు ఎం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. ఆ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలను అవినాష్ రెడ్డి చెప్పారు. సెల్ఫీ వీడియోలో అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. “శివప్రకాష్ రెడ్డి ((వివేకా బామ్మర్ది ) నాకు ఉదయం 6:30కి ఫోన్ చేశారు. నేను అప్పటికే జమ్మలమడుగుకు వెళ్తున్నా. జీకే కొండారెడ్డి పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి వెళ్తున్నా. సరిగ్గా పులివెందుల రింగ్‌రోడ్డులో ఉన్నప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది. వివేకా నో మోర్ అని నాకు ఫోన్‌లో చెప్పారు. దీంతో వెంటనే నేను వివేకా ఇంటికి వెళ్లాను. వివేకా రాసిన లెటర్, ఫోన్ గురించి పీఏ కృష్ణారెడ్డి వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి చెప్పారు. అయితే ఆ లెటర్, ఫోన్‌ను దాచమని రాజశేఖర్ రెడ్డి చెప్పారు. డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టొద్దని లేఖలో వివేకా రాశారు. ఈ మొత్తం మర్డర్ కేసులో ఆ లెటరే చాలా కీలకం. ప్రసాద్‌ను ఏమైనా అంటారేమో అని లేఖ దాచామని సునీత చెప్పారు. మీ నాన్నను కాకుండా డ్రైవర్ ప్రసాద్‌నే నమ్ముతారా? లెటర్ విషయాన్ని నాకు , పోలీసులకు చెప్పలేదు. ఆ లెటర్ విషయంపై సీబీఐ ఎందుకు ఫోకస్ చేయడం లేదు? ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారు? మర్డర్ అని తెలిసిన తర్వాత కూడా లెటర్ ఎందుకు దాచారు? మీ వైపు తప్పు ఉంది కాబట్టే ఆ లెటర్‌ను దాచారు. ఇదే విషయం నేను సీబీఐకి చెప్పాను.” అని అవినాష్ రెడ్డి తెలిపారు.
Read Also: YS Viveka Case: వైఎస్ వివేకా కేసు.. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు
Also Read
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
- అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
ఆ లెటర్‌లో వివేకానందరెడ్డి.. ‘నా డ్రైవర్ నేను డ్యూటీకి త్వరగా రమ్మన్నందుకు చచ్చేలా కొట్టాడు. ఈ లెటర్ రాసేందుకు నేను చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టవద్దు’ అని పేర్కొన్నారు. ఇది వివేకానందరెడ్డి రాసిన చివరి మాటలు, వివేకానందరెడ్డిది హత్య అని చెప్పడానికి లెటర్ అనేది చాలా కీలక ఆధారమని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ లెటర్‌ను ఎందుకు దాచిపెట్టమన్నారని అడిగితే.. “ప్రసాద్ చాలా మంచోడు అని, ఆయనను ఎవరైనా ఎమైనా అంటారని దాచిపెట్టమన్నట్టుగా రాజశేఖర్ రెడ్డి, సునీత చెబుతారు. సునీతా వాళ్ల నాన్నను నమ్మదా?. వాళ్ల నాన్న చివరి సారిగా రాసిన లేఖ, మాటలను నమ్మరా?. ప్రసాద్‌నే ఎక్కువ నమ్ముతారా?. ఇది వినడానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. సీబీఐ స్టేట్‌మెంట్‌లో సునీతా ఒక్కో స్టేట్‌మెంట్ ఒక్కో మాదిరిగా చెబుతుంది. ఒక్క స్టేట్‌మెంట్ చాలా వివరంగా చెబుతుంది. తర్వాత స్టేట్‌మెంట్‌లో తప్పులను కవర్ చేస్తుంది. తాను అలా అనలేదని, మర్చిపోయానని చెబుతుంది. ” అని అవినాష్ చెప్పుకొచ్చారు.
“సీబీఐ వాళ్లకు చాలా స్వేచ్చ ఇచ్చింది. రాజశేఖర్ రెడ్డి, సునీత చేసిన మిస్టేక్స్‌ను కవర్ చేసుకునే స్వేచ్చ ఇస్తుంది. ఈ విధంగా లెటర్ ఉందని సమయానికి పోలీసులకు గానీ, తనకు గానీ చెప్పకపోవడం.. ఈ కేసులో అతిపెద్ద తప్పు. అటువంటి ఆధారాన్ని దాచిపెడితే సీబీఐ విచారణలో రామ్ సింగ్ అనే దానిని డౌన్ ప్లే చేశారు. ఈ అంశం నన్ను తీవ్రంగా ఆశ్చర్యపరిచింది. సీబీఐ మొత్తాన్ని నేను బ్లేమ్ చేయడం లేదు. రామ్ సింగ్ వైఖరి మాత్రం తేడాగా ఉంది. లెటర్‌ను డౌన్ ప్లే చేయడం ఎవరిని కాపాడేందుకు?. శివప్రకాశ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సునీతను కాపాడేందుకు రామ్ సింగ్ ఇదంతా చేశారు. వాళ్లు చేసేది తప్పు. లెటర్ గురించి సరైన సమయంలో సమాచారం ఇవ్వకపోవడం అతిపెద్ద తప్పు. ” అని సెల్ఫీ వీడియోలో అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. వైఎస్ వివేకా కేసులో ఏ1 నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు గురువారం రద్దు చేసింది. వచ్చే నెల 5లోగో హైదరాబాద్ సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని ఎర్ర గంగరెడ్డిని ఆదేశించింది. ఒకవేళ గంగిరెడ్డి లొంగిపోకపోతే అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి తెలంగాణ హైకోర్టు సూచించింది. గతంలో అరెస్ట్ అయిన గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైఎస్ వివేకా కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై వైఎస్ సునీతారెడ్డి కూడా ఇంప్లీడ్ అయ్యారు. ఇరుపక్షాల వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు సీబీఐ వాదనలతో ఏకీభవించింది. ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో గంగిరెడ్డి బెయిల్‌పై సీబీఐకి హైకోర్టులో ఊరట లభించినట్లయింది.
తాజావార్తలు
-
Crude Oil Price Today: బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి