Vizag Swetha Case: శ్వేత మృతి కేసు.. కీలకంగా మారిన పోస్టుమార్టం రిపోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Swetha Case: విశాఖ బీచ్‌లో శ్వేత అనే మహిళ మృతదేహం కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. విశాఖ బీచ్‌లో యువతి మృతదేహం కేసులో పోస్టుమార్టం రిపోర్టులో ఏముందనేది ఆసక్తిగా మారింది. ఆర్కే బీచ్‌లో శ్వేత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. విశాఖ మూడో పట్టణ పోలీసులు, రెవెన్యూ అధికారులు శ్వేత మృతదేహానికి శవ పంచానామా నిర్వహించారు. విశాఖపట్నంలోని కేజీహెచ్ మార్చురీలో ముగ్గురు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఈ పోస్టుమార్టానికి సంబంధించిన నివేదికను వైద్యులు పోలీసులకు అందించారు. ఈ నివేదికలో ఏముంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొదట శ్వేత మృతిని ఆత్మహత్యగా అనుకున్నారు. కానీ ఆమె మృతదేహం పడి ఉన్న తీరు అనుమానాస్పదంగా ఉండడంతో.. అనుమానాస్పద మృతిగా కేసును విచారణ చేపట్టారు. విశాఖ మూడో పట్టణ పోలీసుల చేతుల్లో ప్రస్తుతం ఈ పోస్టుమార్టం నివేదిక ఉంది.
శ్వేత అనుమానాస్పద మృతిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో శ్వేత తల్లి ఆరోపణల మేరకు, సూసైడ్ లెటర్ ఆధారంగా ఆమె.. భర్త, అత్త, మామ, ఆడపడుచు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పోలీసులు శ్వేత ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. మరోవైపు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో మరో ఊహించని మలుపు చోటుచేసుకుంది. శ్వేతను ఆమె భర్త మణికంఠ, అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తే, మణికంఠ సోదరి భర్త సత్యం లైంగిక వేధింపులకు గురి చేసినట్లు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆమె తల్లి రమ ఫిర్యాదు చేశారు. ఒకటి రెండు సార్లు శ్వేతను ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మణికంఠ సోదరి భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అత్త, ఆడపడుచులపై వరకట్న వేధింపుల కేసు కట్టి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
Read Also: Ambati Rambabu : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హజరయ్యే హక్కు చంద్రబాబుకు లేదు
శ్వేత మృతదేహాన్ని ఆమె తల్లి, బంధువులకు అప్పగించగా.. కాన్వెంట్ కూడలి సమీపంలోని చావులమదుం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రద్దీగా ఉండే బీచ్ రోడ్‌లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో.. దర్యాప్తు ముందుకు సాగడం లేదు. శ్వేత ఏ సమయంలో ఎక్కడ ఉంది అనే అంశాలపై పోలీసులకు స్పష్టమైన అవగాహన రావడం లేదు. దీనివల్లే ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేకపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో పోస్టుమార్టం నివేదికతో పాటు ఆమె సెల్‌ఫోన్ కీలకంగా మారింది. ప్రస్తుతం ఆమె కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇలా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!