JEE Advanced: భారతదేశంలోని 23 ఐఐటీలలో బీటెక్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ప్రారంభమైంది. జరగనుంది. భారతదేశ వ్యాప్తంగా ఏకంగా రెండు లక్షల మంది పోటీ పడుతుండగా.. మన తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 35 వేల మంది ఈ పరీక్ష రాస్తున్నారు. ఇక ఈ పరీక్ష సమయం వివరాల్లోకి వెళితే… ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ -1 నిర్వహిస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటలకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు అధికారులు. ఇక ఈ నెల 18వ తేదీన ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈసారి 16,800 సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరుతున్నారు అధికారులు. జేఈఈ మెయిన్స్ పరీక్షలలో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అధికారులు అనుమతించడం లేదు. చాలా ప్రాంతాల్లో నిమిషం ఆలస్యం నిబంధన వల్ల విద్యార్థులను నిర్వాహకులు అనుమతించలేదు.
Read Also: Hyderabad: నేడు హైదరాబాద్ లోని ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
అడ్వాన్స్‌డ్ ర్యాంకు ఆధారంగా ఐఐటీలే కాకుండా దేశవ్యాప్తంగా మరికొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రవేశాలు కల్పిస్తాయి. గత విద్యా సంవత్సరం (2022-23) అన్ని ఐఐటీల్లో 16,598 సీట్లు అందుబాటులో ఉండగా…ఈసారి మరో 200 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సుమారు 42 వేల మందిని జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత కల్పిస్తారు.