Chandrababu: నేడు ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక భేటీ.. ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చాలా కాలం అనంతరం చంద్రబాబు అమిత్ షాతో భేటీ కావడం, ఇవాళ ప్రధాని మోదీని కలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా పొత్తులపై క్లారిటీ తెచ్చుకోవడమే లక్ష్యంగా ఈ భేటీలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి జగన్ సిద్దమవుతున్నారని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం గత ఏడాదిగా జోరుగా నడుస్తోంది. ఇటీవల ఆ ప్రచారం మరింతగా ఎక్కువైంది. ఈ క్రమంలో అనూహ్యంగా చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Also: JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ప్రారంభం
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
శనివారం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. శనివారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. దాదాపు 40 నిమిషాలపాటు ఈ భేటీ జరగ్గా.. తెలంగాణ, ఏపీ రాజకీయాలపై చర్చించుకున్నట్లు సమాచారం. విభజన హామీలను నెరవేర్చనందుకు, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు 2018లో ఎన్డీఏ నుంచి వైదొలిగాక తొలిసారి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కావడం కీలకంగా మారింది. పొత్తులపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధానితో భేటీ కానుండటం కీలకంగా మారింది. ఇవాళ ఉదయం మోదీతో భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరిగి బయల్దేరనున్నారు. అలాగే నేడు పలువురు కేంద్ర పెద్దలను కూడా కలిసే అవకాశముందని తెలుస్తోంది. గతంలో జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో మోదీతో 5 నిమిషాల పాటు చంద్రబాబు ఏకాంతంగా మాట్లాడారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ మోదీతో చంద్రబాబు భేటీ కానుండటం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?