శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది టీటీడీ. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ప్రకటన చేసింది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
కర్నూలు జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. తల్లీ, కూతురిని దుండగులు నరికి చంపిన దుండగులు
టీడీపీ రాజకీయం కోసం పరిశ్రమల సదస్సులు నిర్వహించిందని.. వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం సమ్మిట్ నిర్వహిస్తోందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల నుంచి తమ టార్గెట్ ప్రారంభం అవుతుందన్నారు.
మాటల కంటే చేతలు ముఖ్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జగన్ అంటేనే విద్యాలయాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. నాడు నేడు పథకంలో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మంచి విద్య అందేలా స్కూళ్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను చంద్రబాబు మర్యాద పూర్వకంగా కలిశారు.
పట్టాభి చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిప్పాలని చంద్రబాబు చూస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్ ప్రజలను నమ్మి పార్టీ పెట్టారని.. కానీ ఎన్టీఆర్‌పై కుట్ర చేసి, నిందలు వేసి చంద్రబాబుని సీఎం చేశారని ఆయన అన్నారు.
మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వట్టి వసంత్ కుమార్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Brahmotsavalu in Tirumala: ఏడాదికి 365 రోజులు మాత్రమే. కానీ.. ఏడుకొండలవాడికి అంతకన్నా ఎక్కువే ఉత్సవాలు జరుగుతుంటాయి. సంవత్సరం పొడవునా సప్తగిరుల పైన నిర్వహించే సంబరాలన్నింటిలోకీ బ్రహ్మోత్సవమే సర్వోన్నతమైంది. సకల సందేశాలతో కూడింది. కలియుగ దైవం కోవెల నుంచి ఉత్సవమూర్తి రూపంలో భక్తకోటిలోకి వచ్చి వాళ్ల హృదయాల ఊయలలో, మారుమోగే గోవింద నామస్మరణాల నడుమ ఊరేగుతాడు. తనను కొలిచే గుండెల్లో, పిలిచే గొంతుల్లో అంతర్లీనంగా గొప్ప ఆధ్యాత్మిక భావనను నింపుతాడు.