కర్నూలు జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. తల్లీ, కూతురిని దుండగులు నరికి చంపిన ఘటన కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపుతుంది. ఓ భవనం పై అంతస్తులో తల్లిని.. కింద అంతస్తులోని ఓ గదిలో కూతురిని హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిస్థితి సమీక్షించారు. ఈ జంట హత్యలకు కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. మృతులు రుక్మిణి, రమాదేవిగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ హత్యల ఘటనలో రమాదేవి తండ్రి వెంకటేశ్వర్లకు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీంతో అతణ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Also Read : Pawan Kalyan: వారాహిపై బయల్దేరిన పవన్.. గజమాలతో గ్రాండ్ వెల్ కం
అయితే కర్నూలుకు చెందిన శ్రావణ్ కు రుక్మిణిని ఇచ్చి వివాహం చేశారు. హైదారాబాద్ లో బ్యాంక్ ఉద్యోగం చేస్తున్న శ్రవాణ్ కు పెళ్లి తరువాత ఆపరేసన్ అయింది. దీంతో తన కుమారుణ్ణి సంసారానికి పనికి రాకుండా చేసావంటూ కక్షగట్టిన శ్రవణ్ తండ్రి ప్రసాద్.. రుక్మిణి, తల్లి రమాదేవిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి తంతు ముగిశాక ఇవాళే అత్తవారింటికి రుక్మిణి వచ్చింది. కూతురును వదిలేట్టేందుకు కర్నూలుకు రుక్మిణి తల్లి రమాదేవి, తండ్రి వెంకటేశ్వర్లు వచ్చారు. ఈ కక్ష మనసులో పెట్టుకున్న శ్రవణ్ అతని తండ్రి ప్రసాద్ ఇద్దరు కలిసి రుక్మిణి, ఆమె తల్లి రామాదేవిని దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది.
Also Read : RSS: రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా మాట్లాడాలి..
మరోవైపు పోలీసులు హత్యలకు కారణం, కుటుంబ కలహాలా? పాతకక్షలా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన వారు వనపర్తికి చెందిన మహిళలుగా పోలీసులు గుర్తించారు. వారం రోజుల క్రితమే వివాహం జరిగిందని పోలీసులు గుర్తించారు.. కేవలం వారం రోజుల క్రితమే పెళ్లి జరిగితే రుక్మిణిని, ఆమె తల్లి రమాదేవినీ హత్య చేయాల్సిన అసవరం ఎవరికి ఉంది? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ డబుల్ మర్డర్లతో కర్నూలు వాసులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.