Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 19న ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది టీటీడీ. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ప్రకటన చేసింది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా సెప్టెంబరు నెల కోటాను జూన్ 19న విడుదల చేయనుంది. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్‌లో వీటిని బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్ లక్కీ డిప్ కోసం జూన్ 19న ఉదయం 10గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
Also Read: TTD: గోవిందరాజస్వామి రథం సేఫ్.. విష ప్రచారాలు నమ్మొద్దు
Also Read
సెప్టెంబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటాను, అదేవిధంగా వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. సెప్టెంబర్ నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లకు సంబంధించి కూడా టీటీడీ అప్‌డేట్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్నట్లు పేర్కొంది. పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ విషయాలను గమనించి సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!