మార్ఫింగ్ వీడియోలను తనవిగా చూపేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాబోవని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఫేక్ వీడియోపై టీడీపీ ఫోరెన్సిక్ నివేదిక హాస్యాస్పదమన్నారు. ఓటుకు నోటు కేసుపై అమెరికా ఫోరోన్సిక్ నిపుణులతో టీడీపీ ఎందుకు పరీక్షలు చేయించలేదని ప్రశ్నించారు.
హత్య చేసిన ఎమ్మెల్సీని, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీని రక్షించడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమా అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ వేయకుండా పోలీసులు అనంతబాబుకి ఎందుకు సహకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ తీరం డిగాకు సమీపంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. తీరం దాటిన తర్వాత కూడా మరో 24గంటలు వాయుగుండంగానే ప్రయాణం చేయనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం కన్వీనర్‌గా కార్యకర్తల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నారా లోకేష్.. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించారు. చిన్న చిన్న సమస్యలకీ ఆస్పత్రుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు ఖర్చు చేయలేని నిరుపేదలు, నియోజకవర్గంలో గ్రామీణుల కోసం మొదటిసారిగా `సంజీవని ఆరోగ్య రథం` పేరుతో మొబైల్ ఆస్పత్రి ఆలోచనకి కార్యరూపం ఇచ్చారు.
లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను కేవలం జనాభా ప్రాతిపదికన చేయడం వలన ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ తీవ్రంగా నష్టపోతాయని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో రియలా..? ఫేకా..? అనేది తేలాకే చర్యలుంటాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అరగంటలోనో.. గంటలోనో రిపోర్ట్ వస్తుందని టీడీపీ అంటోందని.. కానీ రిపోర్టు ఇంకా రాలేదని.. విచారణ జరుగుతోందన్నారు. కొన్నాళ్లు ఆగితే కొంపలేం మునిగిపోవన్నారు.
విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. భవన నిర్మాణానికి స్థల సేకరణ కూడా పూర్తయ్యిందని తెలిపారు. జోన్ ఏర్పాటుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో మరోసారి ఎలుగుబంట్లు హల్‌చల్ చేశాయి. పట్టపగలు గ్రామాల్లో సంచరిస్తూ ఎలుగుబంట్లు స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం చినవంకలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోకి మూడు ఎలుగుబంట్లు చొరబడ్డాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం వేములపల్లిలో ఓ దారుణం జరిగింది. ఓ నాలుగేళ్ల చిన్నారిపై కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. వేములపల్లిలోని రామకృష్ణ పౌల్ట్రీఫారంలో రమణ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు.