తన భూమి కబ్జా చేశారని మడకశిరకు చెందిన ఓ జవాన్ జమ్మూ కాశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. మడకశిర మండలం హుదుగూరు గ్రామంలో కబ్జాదారుల నుంచి తన భూమిని కాపాడాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా అధికారులను వేడుకున్నారు బిఎస్ఎఫ్ జవాన్ నరసింహమూర్తి. జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న తన భూమి గ్రామంలోని తన మామ కబ్జా చేస్తున్నాడని ఆరోపించాడు. తన భూమిలో సాగు చేయడానికి వెళ్తే నాగరాజు అనే వైసీపీ నాయకుడు రాళ్లు, కొడవలి తీసుకుని దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read:Shreyas Iyer: భారీ మ్యాచులంటే నాకు చాలా ఇష్టం.. వేలం గురించి ఆలోచించలేదు!
కోర్టు కూడా ఆ భూమి తనదేనని తేల్చిందని జవాన్ తెలిపాడు. కోర్టు తీర్పును రక్షించాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జవాన్ వాపోయాడు. ఒక్క డాక్యుమెంట్ కూడా లేని వ్యక్తి తన భూమిని కబ్జా చేసి సాగు చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తనకు న్యాయం జరగలేదని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు జవాన్ నరసింహమూర్తి. దేశం కోసం సరిహద్దుల్లో కాపలాకాస్తుంటే… గ్రామంలో తన కుటుంబానికి రక్షణ లేకుండా పోయిందన్నాడు. తనకు న్యాయం చేయాలని మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను జవాన్ నరసింహమూర్తి వేడుకున్నారు.