జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లను జనసేన పెండింగ్‌లో పెట్టింది.
లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ అధిష్ఠానం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. ఏపీ నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార పార్టీకి నేతలు షాకులిస్తున్నారు. ఒకొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కమలం గూటికి చేరారు. వైసీపీకి గుడ్ బై చెప్పి ఆయన.. బీజేపీలోకి చేరిపోయారు.
నెల్లూరు లోక్‌సభ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో పలువురు జన సేన నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో ఎక్కడా జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదన్నారు. కేవలం చట్ట సభల్లోకి రావడానికే టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ, మాజీ మంత్రి సుజయ కృష్ణా రంగారావులు కలిశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పిఠాపురంలో రాజకీయ పరిణామాలపై పవన్-వర్మ మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.