విశాఖపట్నం డ్రగ్ కంటైనర్ కేసు విచారణలో సీబీఐ అధికారులకి కొత్త డౌట్స్ వస్తున్నాయి. నాలుగు రోజుల విచారణలో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. ఆరు రకాల నిషేధిత సింథటిక్ డ్రగ్స్ అవశేషాలు గుర్తించారు.
రేపు ( సోమవారం) తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఘనంగా జరుగనుంది. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురం పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.. యూ కొత్తపల్లి మండలానికి చెందిన కాపు నేతలతో సమావేశం నిర్వహించారు.. కిర్లంపూడిలో తన నివాసంలో ఈ మీటింగ్ జరిగింది.. ఎన్నికల ప్రచార శైలి ఏ విధంగా ఉండాలి.. సభలు, సమావేశాలు ఎలా నిర్వహించాలి.. వాటిపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రేణమాల గ్రామంలో వైసీపీకి చెందిన 100 కుటుంబాలు, సుమారు 500 మంది ఓటర్లు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో మండల కన్వీనర్ ఓంకారం ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు.