ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియరైంది. దానికి సంబంధించి సర్కార్కు పలు సూచనలు ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మున్సిపల్, పంచాయితీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్కు సిద్ధం కావాలంటూ... ఒక షెడ్యూల్తో కూడిన వివరాలు అందజేసింది కమిషన్. వచ్చే ఏడాది జనవరిలోపు మున్సిపాలిటీలకు, ఆ తర్వాత జులైలోపు పంచాయతీలు, జడ్పిటిసి....ఎంపిటిసీలకు ఎన్నికలు జరపాలని సూచించింది.
ఒక నియోజకవర్గంలో జరిగే గొడవల గురించి ఇంకో నియోజకవర్గానికి చెందిన నాయకులు పట్టించుకునే పరిస్థితి సాధారణంగాఉండదు. అలా జోక్యం చేసుకోవడానికి అవతలివాళ్ళు ఒప్పుకోరు, ఏ పార్టీ అధిష్టానం కూడా అలాంటివాటిని ప్రోత్సహించదు. కానీ... మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు అన్నట్టుగా ఉందట అక్కడి వ్యవహారం. తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన జేసీ.... శింగనమలలో జోక్యం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులకు కంటిమీదా కునుకు లేకుండా చేస్తున్నా ఎనుగులు చెక్ పెట్టడానికి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారు.. ఇప్పటికే కుంకు ఎనుగులు జిల్లాలో ఉండగా వాటితో పాటు టెక్నాలజీ సాయంతోను ఎనుగుల దాడులకు బ్రేక్ వేయాలని చూస్తోంది అటవీశాఖ శాఖ.... అలా టెక్నాలజీనీ, ఎఐ వినియోగించు ఎనుగులు దాడులను చెక్ పెట్టడమే కాకుండా వాటి సంరక్షణ కోసం ఎఐ ఉపయోగపడేలా చర్యలు చేపడుతున్నారు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికార దుర్వినియోగం చేశారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. దీనిపై విచారణ జరిపింది హైకోర్టు.. ఈ సందర్భంగా.. హైకోర్టులో కీలక వాదనలు వినిపించారు పిటిషనర్ తరఫు న్యాయవాదులు..
కేంద్రమంత్రి జేపీ నడ్డాకు ఫోన్ చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో యూరియా సరఫరాపై సమీక్ష నిర్వహించిన సీఎం.. సమావేశం మధ్యలోనే జేపీ నడ్డాకు ఫోన చేశారు.. కాకినాడ తీరానికి వచ్చే నౌకలో 7 వేగన్లు.. ఏపీకి కేటాయించాలని కోరారు.. దీనిపై సానుకూలంగా స్పందించారట నడ్డా.. ఇక, దీంతో, రాష్ట్రానికి 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను కాకినాడ పోర్టులో దిగుమతికి జీవో జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు మరోసారి టీటీడీ ఈవోగా నియమితులైన అనిల్ కుమార్ సింఘాల్.. టీటీడీ ఈవోగా రోండోవసారి నియమితులైన మొదటి అధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ రికార్డుకెక్కారు..
యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఆర్జీజీఎస్ నుంచి ఆయా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు..
ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్ ఎంపీలు.. తెలుగు వ్యక్తి, యూపీఏ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.