చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని రేపు 12 గంటల పాటు మూసివేయనుంది టీటీడీ. ఆలయంలో 15 గంటల పాటు దర్శనాలు నిలిచిపోనుంది. మరోవైపు అన్న ప్రసాద సముదాయాన్ని కూడా రేపు మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8:30 గంటల వరకు మూసి వేయనుంది టీటీడీ. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలతో పాటు పౌర్ణమి గరుడసేవను రద్దు చెయ్యగా.. ఎల్లుండి సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.
మరో ఆందోళనకు సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈనెల 9వ తేదీన వైసీపీ 'అన్నదాత పోరు' పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది.. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చింది.. ఆర్డీవో కార్యాలయాల ఎదుట వైసీపీ శాంతియుత నిరసనలు తెలపనుంది.. 'అన్నదాత పోరు' పోస్టర్ని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు.
ఎంపీ మిథున్‌రెడ్డికి కోర్టులో కాస్త ఊరట దక్కింది.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయటానికి ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు..
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ రోజు తాడిపత్రి పట్టణంలోని తన సొంత ఇంటికి చేరుకున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. ఈ పరిణామంతో సుమారు 15 నెలల తరువాత కేతిరెడ్డి తన సొంత ఇంటికి చేరుకున్నట్టు అయ్యింది.. గత ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణల కారణంగా పట్టణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు పెద్దారెడ్డి.. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో భారీ బందోబస్తు నడుమ తాడిపత్రి పట్టణంలోకి ఎంట్రీ ఇచ్చారు..