Sand Mafia: నెల్లూరు జిల్లా పెరమణ జాతీయ రహదారిపై ఇసుక టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మామూలుగా ఇంత పెద్ద ప్రమాదం జరిగితే 24 గంటల్లోపు నిందితుల్ని అరెస్టు చేస్తారు పోలీసులు.. ప్రభుత్వం కూడా వేగంగా స్పందిస్తుంది. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలకు ఆదేశిస్తుంది. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ప్రమాదం జరిగి ఆరు రోజులు అవుతున్న ఇంతవరకూ నిందితులు ఎవరనే దానిపై పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. A1, A2, A3 అంటూ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినప్పటికీ.. అందులో A1, A2 వివరాలను మాత్రం బయట పెట్టలేదు. కనీసం వారి పేరుని సైతం FIRలో పొందుపరచ్చలేదు.. విచారణ తరువాత డ్రైవర్ తోపాటు టిప్పర్ ఓనర్ పేరును ఛార్జ్ షీట్లో పెడతామని పోలీసులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు.. ప్రమాదానికి కారకులైన డ్రైవర్, ట్టిప్పర్ ఓనర్ని తప్పించి.. మరో డ్రైవర్ పేరు పెట్టేందుకు పోలీస్ శాఖపై సదసు సీఐ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
Read Also: Shocking : ఓవర్సీస్ ‘OG’ డిస్ట్రిబ్యూటర్ సంఘ విద్రోహి.. మా థియేటర్స్ లో ‘OG’ రిలీజ్ చేయడం లేదు
ముఖ్యంగా ఇసుక, గ్రావెల్ తో పాటు క్యాట్ ఫిష్, పిడిఎస్ రైస్ అక్రమార్కులు సదరు పోలీస్ స్టేషన్‌లోని ఉన్నతాధికారులతో కుమ్మక్కై.. వారికి చేతులు తడుపుతున్నారన్న ప్రచారం ఆత్మకూరు సబ్ డివిజన్ పోలీస్ శాఖలో జరుగుతోంది. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కూడా డ్రైవర్ని, ఓనర్ని తప్పించేందుకు పోలీస్ శాఖలోని ఓ సీఐ విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.. ఇది గమనించిన నెల్లూరు ఎస్పి అజిత.. సదరు సీఐ కి వార్నింగ్ సైతం ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అయితే…ఏడు మంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ కేసును ఆత్మకూరు డిఎస్పి వేణుగోపాల్ కి ఉన్నతాధికారులు అప్పగించారు. ఆరు రోజులు గడుస్తున్న ఇందులో ఇంతవరకు కేసు ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదు.
విచారణ పేరుతో కాలయాపన చేస్తూ కేసును పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయా నేతల ఒత్తిళ్లకు తలోగ్గి.. పోలీసులు కేసును నిర్లక్ష్యం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ డ్రైవర్ కారును ఢీ కొట్టి.. అనంతరం స్టేషన్ కు వెళ్లిపోయినట్లు సమాచారం.. అయితే టిప్పర్ డ్రైవర్ వివరాలను కూడా పోలీసులు ఇంతవరకు బహిర్గతం చేయలేదు. టిప్పర్ ఏ కంపెనీ పేరు మీద ఉందో.. ఓనర్ ఎవరనే విషయాన్ని పోలీసులకు తెలిసినప్పటికీ.. అతని తప్పించేందుకు పోలీసులు నాటకాలు ఆడుతున్నారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆయన్ని తప్పించేందుకు పోలీసులు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని సొంత శాఖలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ కేసును కొత్త ఎస్పీ అజిత ఎలా డీల్ చేస్తారో.. ప్రమాదానికి కారణమైన నిందితులను అరెస్టు చేస్తారో లేదో చూడాలి…