గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
దసరా ఉత్సవాల్లో రెండవ రోజున కనక దుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం, ధరించి దర్శనమిస్తుంది. గాయత్రీ ఉపాసానతో మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి. గాయత్రీ మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఆది శంకరులు గాయత్రీ దేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతఃకాలంలో గాయత్రీ గానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయంసంధ్యలో సరస్వతిగానూ ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనలు అందుకుంటుంది.. గాయత్రీమాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.
ఎఫ్‌బీలో పోస్ట్.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్‌పై వేటు..
సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. ఇక, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు మాత్రం చాలా కేర్ తీసుకోవాలి.. లేకపోతే.. ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి కూడా రావొచ్చు.. ఇప్పుడు తిరుపతి GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ ఫొటోలుతో ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు సుభాష్… వాణిజ్య పన్నులశాఖ తిరుపతి ప్రాంతీయ ఆడిట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ (FAC)గా పనిచేస్తున్న ఎస్.సుభాష్ చంద్రబోస్.. రాజధాని అమరావతిపై ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్టులు పెట్టారు. రాజధానిలో శాఖమూరు, నీరుకొండ, కృష్ణాయపాలెంలో సీఆర్‌డీఏ రిజర్వాయర్లు నిర్మించనుందంటూ వచ్చిన ఓ వార్తను ట్యాగ్ చేస్తూ.. సుభాష్ చంద్రబోస్ అనే అధికారి ‘అమరావతి కోసం 3 రిజర్వాయర్లెందుకు? అమరావతినే ఒక రిజర్వాయర్‌గా కడితే పోలా? అసలే ఏడాదికి 3 పంటలు పండే నేల, రిజర్వాయర్ నీళ్లతో పుష్కలంగా ఉండదా’ అంటూ తన ఫేస్‌బుక్ అకౌంట్లో అత్యంత వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. అంతే కాకుండా ‘ఒకే ఒక్క వర్షం, అమరావతి జలమయం’ అంటూ మరో పోస్ట్ పెట్టారు. అమరావతి నీట మునిగిపోయిందని నమ్మించేందుకు నీరుకొండ -పెదపరిమి మధ్య నీట మునిగిన పంట పొలాల ఫొటోను పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు అమరావతిపై ద్వేషం పెంచేలా కామెంట్స్ చేస్తూ, పోస్టులు పెడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఫిర్యాదుతో విచారణ జరిపిన అనంతరం సుభాష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం..
మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన.. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నేడు మేడారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని, ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించ నిర్వహించనున్నారు. గిరిజన సంప్రదాయాలకు, విశ్వాసాలకు భంగం కలగకుండా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా మేడారం అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు సమాచారం. మహాజాతర నాటికి ఈ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకొనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా రానున్నారు. మొదటగా, అమ్మవారి గద్దెల విస్తరణ పనుల పై పూజారులతో సమీక్ష నిర్వహించి.. అనంతరం, అమ్మవార్లను దర్శించుకుని, ఆశీస్సులు అందుకోనున్నారు. అమ్మవార్ల దర్శనం అనంతరం, మేడారం అభివృద్ధి పనుల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా, ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన డిజిటల్ ప్లాన్ ను ఎలా అమలుపై చర్చలు నిర్వహించనున్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూనే, మేడారంను అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
దసరా వేడుకల్లో సిద్ధరామయ్య రుసరుసలు.. ప్రేక్షకులపై ఆగ్రహం
కర్ణాటకలోని మైసూరులో దసరా ఉత్సవాలు గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించడానికి కర్ణాటక ప్రభుత్వం అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత బాను ముష్తాక్‌ను ఆహ్వానించింది. అయితే ఈ ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రుసరుసలాడారు. ఉత్సవాలను ఉద్దేశించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రసంగిస్తుండగా ప్రేక్షకుల్లో గలిబిలి చోటుచేసుకుంది. దీంతో సిద్ధరామయ్య సహనం కోల్పోయి.. ప్రేక్షకుల్లో ఒకరిపై మండిపడ్డారు. ‘‘నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? నువ్వు కొంచెం సేపు కూర్చోలేవా? కూర్చో. అది ఎవరు? నేను ఒక్కసారి చెబితే నీకు అర్థం కాలేదా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇంట్లోనే ఉండి ఉండాల్సింది.’’ అని కన్నడలో సిద్ధరామయ్య మండిపడ్డారు. ఎవరినీ వెళ్లనియొద్దని ఒక పోలీస్ అధికారికి సిద్ధరామయ్య సూచించారు. ‘‘పోలీసులు.. వాళ్ళని వెళ్ళనివ్వకండి. మీరు అరగంట లేదా గంటసేపు కూర్చోలేరా? మీరు ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరవుతున్నారు?.’’ అని పేర్కొన్నారు.
టారిఫ్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం.. జైశంకర్-మార్కో రూబియో భేటీ
టారిఫ్ ఉద్రిక్తతల వేళ భారత్-అమెరికా మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. సుంకాలు కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ సమావేశం శుభపరిణామంగా భావించొచ్చు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 80వ సెషన్ జరుగుతోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా వెళ్లారు. పర్యటనలో భాగంగా జైశంకర్‌ను మార్కో రూబియో కలిశారు. ఈ సందర్భంగా వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ఔషధాలు, కీలకమైన ఖనిజాలు వంటి కీలక రంగాలు, ముఖ్యంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇక జైశంకర్‌ను కలవడంపై మార్కో రూబియో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రెండు దేశాల మధ్య శ్రేయస్సును పెంపొందించే లక్ష్యంతో ద్వైపాక్షిక భాగస్వామ్యంతో పాటు వివిధ అంశాలపై చర్చలు జరిగాయని పేర్కొన్నారు. రెండు దేశాలు కలిసి పని చేయడానికి అంగీకరించినట్లు ప్రకటనలో తెలిపింది.
ఓవర్సీస్ కంటెంట్ డెలివరి చేయలేక చేతులెత్తేసిన ‘స్టార్’ సినిమా మేకర్స్
వందల కోట్ల బడ్జెట్స్ తో సినిమాలు నిర్మించే మేకర్స్ రిలీజ్ కు కొన్ని గంటల ముందు వరకు కూడా కంటెంట్ డెలివరి చేయలేక కిందా మీదా అవుతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ కంటెంట్ ను రిలీజ్ రోజు కేవలం కొన్ని గంటల ముందు డెలివరి చేసినవి చాలా సినిమాలు ఉన్నాయి. ఓవర్సీస్ ప్రీమియర్స్ తెలుగు స్టేట్స్ కంటే కొన్ని గంటల ముందు స్టార్ట్ అవుతాయి. అయినప్పటికి చివరి నిమిషంలో చెక్కుతూ ఉంటారు మేకర్స్. ఇప్పుడు మరో తెలుగు బిగ్ బడ్జెట్, భారీ హైప్ ఉన్న సినిమా కంటెంట్‌ను సమయానికి డెలివరీ చేయలేక చేతులెత్తేసింది. ట్రైలర్ ను సరైన టైమ్ లో రిలీజ్ చేయని నిర్మాణ సంస్థ ఓవర్సీస్ కంటెంట్ ను ఇంకా అప్ లోడ్ చేయలేదు. ఫలితం ఓవర్సీస్ లోని కొన్ని థియేటర్స్ లో షోస్ క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఓవర్సీస్ బయ్యర్స్ కి ఈ చివరి నిమిషంలో కంటెంట్ జాప్యాలు నిరంతర సిరియల్ లా మారింది. దాంతో విదేశీ పంపిణీదారులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. అటు అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందుతున్నారు. దాంతో పాటు అక్కడి థియేటర్ చైన్‌లు క్రమంగా మన బయ్యర్స్ పై నమ్మకాన్ని కోల్పోతున్నాయి. భారీగా షోస్ అలకేట్ చేయడం తీరా కంటెంట్ అందక షోస్ క్యాన్సిల్ చేయడం. అదేమంటే పర్ఫెక్షన్ కోసం వర్క్ జరుగుతుందని సాకు చెప్పడం. పోనీ ఫైనల్ అవుట్ పుట్ పర్ఫెక్ట్ గా ఇస్తున్నారా అంటే అది లేదు. ఓవర్సీస్ ప్రింట్‌లు ఎప్పుడు లిప్-సింక్ సమస్యలు, నాసిరకం మిక్సింగ్, పూర్ VFX మరియు ఫార్మాట్ లోపాలు వంటి సమస్యలతో ఇస్తున్నారు. అంత నాసిరకంగా ఉన్న కూడా నిర్మాత చెప్పిన ధరకు పంపిణీదారులు చెల్లించాల్సి వస్తుంది. క్వాలిటీ గురించి అడిగితె మాత్రం నిర్మాణ సంస్థలు నోరుమెదపవు. టాలీవుడ్ దిగ్గజ దర్శకులు రాజమౌళి మాత్రమే కంటెంట్‌ను ముందుగానే లాక్ చేసి డెలివరీ చేసి IMAX, డాల్బీ విజన్ మరియు ఇతర ఫార్మాట్‌లు పర్ఫెక్ట్ గా కంటెంట్ అందిస్తారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే ఓవర్సీస్ లో తెలుగు సినిమాను కొనేవారు ఉండరు.
సెట్‌లోనే 4 సార్లు చనిపోయేవాడిని.. ప్రాణాపాయం మధ్య కాంతారా పూర్తి చేశా : రిషబ్ శెట్టీ
పాన్-ఇండియన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం ‘కాంతారా: చాప్టర్ 1’. రిషబ్ శెట్టీ దర్శకత్వంలో ఇప్పటికే హిట్ అయిన కాంతారా చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. భారీ అంచనాలతో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రభాస్ చేతుల మీదుగా సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ లాంచ్ చేసి, చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ట్రైలర్ మొత్తం రిషబ్ శెట్టి లుక్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆకటుకుంది. ముఖ్యంగా, రిషబ్ శెట్టి తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ప్రెస్ మీట్‌లో రిషబ్ శెట్టీ మాట్లాడుతూ.. “సినిమా షూటింగ్ సమయంలో నాకు సెట్స్‌లో 4–5 సార్లు చనిపోయేవాడిని. అనేక ప్రమాదాలు జరిగాయి. కొందరు సినిమా యూనిట్‌లో సభ్యులు అనుకోకుండా మరణించడం కూడా జరిగింది. ఈ పరిస్థితులు చుట్టూ వారిని నిరాశలో నెట్టాయి” అని తెలిపారు. అయిన కూడా చిత్ర యూనిట్ సవాళ్లను ఎదుర్కొని, సినిమాను సమయానికి పూర్తి చేయడానికి కృషి చేసింది. “మేము మూడు నెలలుగా సరిగ్గా నిద్ర పోలేదు. దర్శక బృందం, నిర్మాతలతో సహా ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం తమ సొంతంగా కృషి చేశారు. సెట్‌లో ఎదురైన ప్రమాదాల మధ్య, విశ్వాసం, దైవత్వం మాకు రక్షణగా నిలిచింది” అని రిషబ్ పేర్కొన్నారు.