ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది.. ఆలయం పరిధిలో అర్ధరాత్రి డ్రోన్ ఎగరడం సంచలనంగా మారింది.. ఆలయ పరిసరాలపై అర్ధరాత్రి సమయంలో మరోసారి డ్రోన్ ఎగడరంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు..
ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు కురవబోతున్నాయి.. వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా.. ఉత్తర కోస్తా మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. ఇది సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్లు ఎత్తు లో ఆవరించి ఉందని.. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది విశాఖపట్నం వాతావరణం కేంద్రం..
YSRCP Annadata Poru: ఇవాళ (సెప్టెంబర్ 9న) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరుకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో జరుగుతున్న వ్యవహారాలు, వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవలి పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్న అభిప్రాయం డిపార్ట్మెంట్లో పెరుగుతోంది. శాఖలో కింది నుంచి నుంచి పైస్థాయి వరకు అంతా... తన కనుసన్ననల్లో జరగాలని భావించిన చీఫ్ ఇంజనీర్ చివరికి ముచ్చటగా మూడోసారి కూడా ఏసీబీ వలలో చిక్కారు.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తోన్న ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. లిక్కర్ స్కాం కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలు సవాలు చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది..