జగన్ను, వైసీపీని ఎప్పుడూ వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని పేర్కొన్నారు. పాలసీ పరంగానే విమర్శలు చేశానన్నారు. విజయవాడ అభివృద్ధి నా అజెండా అని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల వేళ నేతలు ప్రచార జోరును పెంచారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కౌతాళం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రాలయంలో మార్పు వస్తోంది.. మంచి రోజులు వస్తున్నాయని ఆయన అన్నారు.
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో వచ్చే నెల అనగా మే 1నే పెన్షన్లు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఈసీ ఆదేశాలతో రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
పులివెందులలో సీఎం జగన్ తరఫున ఆయన సతీమణి వైఎస్ భారతి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గడపగడపకు వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. వైసీపీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వైఎస్ భారతి వివరిస్తున్నారు.
రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్లు మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని.. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనని విమర్శించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ మోసపోవడమేనని ఆరోపించారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తు్న్నారు. సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా విజయవాడ-హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి ఎన్హెచ్-65పై ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.