Manickam Tagore: ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ వ్యవహారాన్ని టీడీపీ మర్చిపోయింది అని ఫైర్ అయ్యారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్.. విజయవాడలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. బీజేపీ, టీడీపీ, జనసేన మేనిఫెస్టో లు ఎవరివి వారివే అని ఎద్దేవా చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచీ ఒక గ్యారెంటీ కార్డు ప్రతీ ఓటరుకు ఇస్తున్నాం… 8,800 ప్రతీనెలా ఒక కుటుంబ ఆదాయంగా ఉండాలి.. అలా లేకపోతే.. కాంగ్రెస్ కేంద్రం నుంచి అందిస్తుందన్నారు. ఇక, బీజేపీకి స్వంతంగా మేనిఫెస్టో నే లేదు అని దుయ్యబట్టారు.. మైనారిటీ డిక్లరేషన్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ ముందు చంద్రబాబు మాట్లాడగలరా? అని సవాల్ చేశారు.. ముస్లిం మైనారిటీలను ఫూల్స్ అనుకుంటున్నారు వాళ్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మరోవైపు.. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 158 స్ధానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని.. మిగిలిన స్ధానాల్లో కమ్యూనిష్టులు పోటీ చేస్తున్నారని వెల్లడించారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా బరిలోకి దిగగా.. టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి.. ఇక, సీపీఎం, సీపీఐ తో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తున్న విషయం విదితమే.
Read Also: Sharad Pawar: ప్రధాని మోడీ నా వేలు పట్టుకుని రాజకీయాలు నేర్చుకున్నారు..