AP Pensions: ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ కష్టాలు.. ఎండలో బ్యాంకుల వద్ద క్యూలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. బ్యాంకు ఖాతాలకు, పెన్షన్లు జమ చేయడంతో పెన్షన్ దారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే డీబీటీ ద్వారా వచ్చిన పెన్షన్ బ్యాంకు అకౌంట్లో పడలేదు.. ఎక్కడికెళ్ళింది.. ఏమైపోయింది.. సచివాలయానికి వెళితే బ్యాంకు ఖాతాలో పెన్షన్ పడింది.. వెళ్ళి తీసుకోండి అంటున్నారు.. తీరా బ్యాంకుకు వెళితే.. ఖాతాలో డబ్బు లేదు.. పెన్షన్ పడలేదు.. సచివాలయానికి కాళ్లీడ్చుకుంటూ ఎండలో పోవాల్సిన పరిస్ధితి.. ఏపీలో చాలా ప్రాంతాల్లో వృద్ధుల పరిస్థితి ఇలా ఉంది. పెన్షన్ ఏమైందో తెలీక వృద్ధులు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. బ్యాంకులకు వెళ్లిన అలవాటు లేకపోవడంతో ఏటీఎం కార్డులు కూడా లేని వృద్ధులు కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Also: AP Pensions: మరో ప్రాణం తీసిన పెన్షన్.. బ్యాంక్ దగ్గర కుప్పకూలి వృద్ధుడు మృతి
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకు ఖాతాలను వాడని వారికి తిప్పలు తప్పట్లేదు. బ్యాంకు లావాదేవీలు లేకపోవడంతో ఎకౌంట్లు డీఆక్టివేట్ లేదా ఫ్రీజ్ మోడ్‌లోకి వెళ్లినట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులు చూపించి, మళ్లీ ఎకౌంటును యాక్టివేట్ చేసుకోవచ్చని చెబుతున్నారు. తమ అకౌంట్లను యాక్టివేట్ చేయించుకునేందుకు బ్యాంకులకు వృద్ధులు క్యూ కడుతున్నారు. ఎండలోనే బ్యాంకులకు వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పెన్షన్లు ఇళ్లకు తెచ్చి ఇచ్చేవారని, ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నామని వృద్ధులు ఆవేదన చెందుతున్నార
ఇదిలా ఉండగా.. అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది.. రాయచోటిలోని కెనరా బ్యాంకుకు పెన్షన్ కోసం వెళ్లి బ్యాంక్ ముందు కుప్పకూలిన వృద్దుడు అక్కడికక్కడే కన్నుమూశాడు.. మృతుడు సుబ్బన్న (80)గా గుర్తించారు. లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకుకు చెందిన ముద్రగడ సుబ్బన్న.. పెన్షన్ కోసం వెళ్లి.. బ్యాంకు వద్ద కుప్పకూలి మృత్యువాత పడ్డారు. ఎండలు మండిపోతూ ఉండడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కాగా, గత నెల గ్రామ, వార్డు సచివాలయల దగ్గర కూడా పెన్షన్ డబ్బుల కోసం పడిగాపులు పడి.. కొందరు వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాష’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!