వైసీపీ అధినేత,సిఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని గుంటూరు వైసీపీ పార్లమెంటు అభ్యర్థి కిలారు రోశయ్య పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు, నవ సమాజ స్థాపనకు మేనిఫెస్టోలో నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
టీడీపీ, చంద్రబాబు మేనిపెస్టోను ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. మేనిఫెస్టోను అమలుపరచి విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించలేదన్నారు. 2014 నుంచి 2019 కాదు , చంద్రబాబు 14 ఏండ్ల సీఎంగా ఎప్పుడూ మేనిఫెస్టో అమలు చేయలేదన్నారు.
తీవ్ర ఎండను కూడా ఖాతరు చేయకుండా ప్రజలంతా సభకు వచ్చారని.. మరో రెండు వారాల్లో జరగనున్న ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావని.. వచ్చే ఐదేళ్లలో ఇంటింటి అభివృద్ధిని.. ప్రతి పేదవాడి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలు అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. దీనిని ప్రజలు గుర్తించాలన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
గుంటూరులోని తూర్పు నియోజకవర్గంలోని 6, 57 డివిజన్లలోని సుమారు 350 మంది నేతలు శనివారం నాడు టీడీపీలో చేరారు. పార్టీలో చేరుతున్న వారిని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వరికుంటపాడు మండలం పరిధిలోని కడియం పాడు గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంతె ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
తిరువూరు పట్టణం 20వ వార్డులో ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ప్రవేశ పెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. టీడీపీని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు చిన్న కోడలు స్వాతి ఇంటింటి ప్రచారం చేస్తూ రెండు ఓట్లు ఫ్యాను గుర్తుకు వేయమని ఓట్లర్లను అభ్యర్థించారు.