ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) రియాక్షన్ మొదలయింది. డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలకు ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నం ఏపీ సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీలు ఇచ్చిన రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని చర్యలు చేపట్టింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెన్షన్ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
జూన్ 9న విశాఖపట్నంలో రెండోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రభుత్వం రావాలి అనే విధంగా పోలింగ్ జరిగింది.. ఇచ్చిన మాట తప్పకుండా జగన్ ఐదేళ్లు పని చేశారు.. ఎన్నికల్లో జగన్ కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు.. మంచి జరిగితే ఓటు వేయాలని జగన్ కోరారు అని గుర్తుచేశారు. విద్య, వైద్యం, పరిపాలనలో సంస్కరణలు కొనసాగిస్తామని జగన్…
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.. వైసీపీ నేతలు, మంత్రులు.. ఈ బృందంలో మంత్రి బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ , కావటి మనోహర్ నాయుడు తదితరులున్నారు.. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న అల్లర్లు, దాడులు వెనుక ఉన్న బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్ ను కోరారు వైసీపీ నేతలు