ఏపీ గవర్నర్కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రభుత్వ ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారం నిలిపేయాలని గవర్నర్ను లేఖ ద్వారా కోరారు చంద్రబాబు.. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు అప్ గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేతపై అనుమానాలు వ్యక్తం చేశారు చంద్రబాబు.. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్ గ్రేడియేషన్ అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన..…
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. జస్టిస్ అభయ్, జస్టిస్ ఉజ్జల్ భూయన్ ధర్మాసనం ఈ విచారణ జరిపింది.. ఇసుక అక్రమ మైనింగ్ పై కీలక ఆదేశాలు వెలువరించింది సుప్రీంకోర్టు.. అక్రమ మైనింగ్ నిరోధానికి ప్రతి జిల్లాలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.. కలెక్టర్, పోలీసులు, అధికారులు ఈ కమిటీలో ఉండాలని.. అక్రమ మైనింగ్ ఆపడానికి చర్యలు తీసుకోవాలని.. అలాగే కమిటీ రెగ్యులర్ గా మైనింగ్ ప్రాంతాలు సందర్శించాలని.. ప్రతి జిల్లాలో ఈ కమిటీ…
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు ( గురువారం ) మహారాష్ట్రకు వెళ్తున్నారు. ఆయన కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించి అక్కడ.. ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం షిర్డికి చేరుకోనున్నారు. షిర్డీలో సాయిబాబా దేవాలయాన్ని దర్శి్స్తారని టీడీపీ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నేడు ( గురువారం ) ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నివేదిక రెడీ చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత జరుగుతున్న గొడవలకు ఎన్నికల సంఘం వైఫల్యమే కారణమన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు అధికారులను ఎన్నికల ముందే బదిలీ చేశారన్నారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు... గొడవలను అరికట్టలేకపోతే... బాధ్యత వారిది కాదా అని ప్రశ్నించారు సజ్జల. ఏపీలో ఏకపక్షంగా దాడులు జరుగుతున్నాయన్నారు.
మరోసారి అధికారంలోకి రాబోతున్నాం.. వైసీపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని దుయ్యబట్టారు.. కూటమి గెలుస్తుందంటూ మావాళ్లను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారన్న ఆయన.. జూన్ 4వ తేదీన వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు..