పల్నాడు కలెక్టరుగా లత్కర్ శ్రీకేష్ బాలాజీ నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కొనసాగుతోంది. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని, పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగియడంతో.. విదేశీ పర్యటనకు వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ (గన్నవరం ఎయిర్పోర్ట్) నుంచి బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి బయలుదేరిన సీఎం జగన్.. ఇవాళ మధ్యాహ్నం లండన్ చేరుకున్నారు.
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో ఎయిర్ పోర్ట్‌లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అతడు అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన డాక్టర్ తుళ్లూరు లోకేష్ గా గుర్తించారు.. లోకేష్ కి అమెరికన్ సిటీజన్ షిప్ ఉన్నట్టు కూడా నిర్ధారణకు వచ్చారు పోలీసులు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. ఆగస్టు నెలకు సంబంధించిన దర్శనం టికెట్లతో పాటు.. వివిధ రకాల సేవా టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)..
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో ప్రమాదం జరిగింది. జి.కొండూరులోని పెట్రోల్ బంకు వద్ద వ్యాన్ టైర్లు పేలి వాహనం పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనలో కలకోటి ప్రవీణ్ (36) అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
ఏపీలో ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రేపట్నుంచి(ఈ నెల 18) ఈ నెల 25వ తేదీ వరకు ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్టు ఎన్ఐసీ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.