ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో అత్యవసరంగా సమావేశం అయ్యారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ కూడా పాల్గొన్నారు.. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) సీరియస్ కావటం.. ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. ఈ అత్యవసరం భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది..
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల తరుణంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సీరియస్ అయ్యింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) ఏపీలో ఎన్నికల నిర్వహణ, పోల్ అనంతర హింసపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఈసీ.. సున్నిత ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతాయన్న సమాచారం ఉన్నా.. ఎందుకు ఈ స్థాయిలో హింస చేలరేగుతోందని మండిపడింది.
పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ ప్రమాదంలో చనిపోయిన బస్ డ్రైవర్ షరీఫ్ అని పోలీసులు తెలియజేస్తున్నారు. దీంతో షరీఫ్ అనే పేరుతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డ్రైవర్ రాకపోవడంతో తానే డ్రైవింగ్ కు వచ్చానని అంజి చెప్పినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది అని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఇది పేదలకు పెత్తందారులకు మద్య జరిగిన యుద్ధం.. ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు.
పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.
గత ఐదేళ్లుగా ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం చేసింది అని ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర తెలిపారు. అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా ప్రవర్తించారు.. ఎన్నికల సమయంలో.కొందరు పోలీస్ అధికారులు పరిధి దాటి ప్రవర్తించారు.. చంద్రగిరి నియోజకవర్గ ల్ స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగిన ఘటనే నిదర్శనం అన్నారు.