ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై 13 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం విచారణ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల తీరుపై విచారిస్తోంది.
విశాఖపట్నంలో ఓ మందుబాబు హల్చల్ చేశాడు. ట్రాఫిక్ పోలీసులపై మందుబాబు వీరంగం సృష్టించాడు. విశాఖలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా ఇద్దరు స్నేహితులు తాగి బండిపై వచ్చారు. వారిలో ఓ వ్యక్తి అక్కడి నుంచి పరారీ కాగా.. మరో వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.
కడప జిల్లా జమ్మలమడుగులో పరిస్థితులను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సమీక్షించారు. ఎన్నికల రోజు పోలీసుల పనితీరు భేష్ అంటూ ఆయన ప్రశంసించారు. జమ్మలమడుగులో ఎన్నికల రోజు తలెత్తిన వివాదాలను పోలీసులు చాకచక్యంగా అణిచివేశారని.. పోలీసులు ప్రాణాలకు తెగించి చాలెంజింగ్‌గా పరిస్థితులను అదుపు చేశారని చెప్పుకొచ్చారు.
ఏపీలో ఎన్నికల సమయంలో, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంక్ నిర్వాహకులను ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఉద్యోగం ఆశ చూపించి మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్లు వారు తెలిపారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గౌతమి గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. మరో ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.
కూటి కోసం, కూలీ కోసం రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. గోడ కూలి ఇద్దరు మరణించారు. దీంతో వారి కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. అనంతపురం జిల్లా కూడేరు మండలం గొటుకూరు దగ్గర నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.