ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై నేడు మరో నివేదికను సిట్ ఇవ్వనుంది. సోమవారం ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనే.. కీలక సిఫార్సులు, గుర్తించిన అంశాలు పొందుపర్చింది. ప్రస్తుతానికి 2 రోజుల విచారణ ముగిసినప్పటికీ.. కేసులపై పర్యవేక్షణ ఇకపై కూడా చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
గోవింద నామ స్మరణతో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం మార్మోగింది. గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్వవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం గరుడసేవ ఘనంగా నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లా మొత్తం సెక్షన్ IPC 144, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని సీపీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించినట్లు తెలిపారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది.. అపోహలకు పోయి ఎలాంటి గొడవలకు దారి తీయొద్దు.. అనుమానాలుంటే పోలీసు నంబర్లకు కాల్ చేయచ్చు అని ఆయన పేర్కొన్నారు.
తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఏఎస్డీ లిస్ట్ లో ఉన్న 54 వేల మంది ఓటర్ లిస్ట్ లో 4 వేల మంది మాత్రమే ఓటు వేశారు అని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ కి ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ అలర్ట్ చేసింది. కౌంటింగ్ కు ముందు, తర్వాత దాడులు జరిగే ఛాన్స్ ఉందని ఎన్నికల కమిషన్ కు నిఘా వర్గాలు నివేదికను ఇచ్చాయి.
నేడు ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై సిట్ చీఫ్ నివేదిక సిద్ధం చేస్తున్నారు. నేడు ప్రాథమిక నివేదికను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ఇవ్వనున్నారు.