ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. రేపు(జూన్ 22న) పులివెందులకు వెళ్లనున్నారు వైఎస్ జగన్.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టడంపై ఆయన సతీమణి భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. 'నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు! నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది.. ప్రజలకు ప్రణామం!' అంటూ ట్వీట్ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమల రావు భేటీ అయ్యారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెం హత్య ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు డీజీపీ ద్వారకా తిరుమల రావు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించారు.
అమరావతి మాస్టర్ ప్లాన్పై ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్తోనే ముందుకెళ్తామని ఆయన వెల్లడించారు. అమరావతి నిర్మాణంపై పూర్తిగా స్టడీ చేసి ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారని.. ఆ దిశగా నివేదిక రెడీ చేసి ప్రజల అభిప్రాయంతో నిర్మాణం చేపడతామన్నారు.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో ఈతకు వెళ్లి ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నలుగురు గల్లంతయ్యారు. నలుగురు ఈత కోసం సముద్రంలోకి వెళ్లగా.. ముగ్గురి మృతదేహాలు తీరానికి కొట్టుకువచ్చాయి.
సీజనల్ వ్యాధులపై సమీక్షలో అధికారులను వరుస ప్రశ్నలతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉక్కిరిబిక్కిరి చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై అధికారులను ఆయన నిలదీశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఎందుకివ్వలేదంటూ పవన్ అసహనం వ్యక్తం చేశారు.
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో సుచరిత అనే మహిళ హత్యకు గురైంది. సుచరిత హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు.