విజయవాడలోని బీసీ సంక్షేమ హాస్టల్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత. హాస్టల్లోని సదుపాయాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మంత్రి ఆకస్మికంగా హాస్టల్‌కు వచ్చారు. స్టోర్ రూమ్, విద్యార్థుల వసతి గదులను మంత్రి పరిశీలించారు.
డయేరియా నివారణ చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. డయేరియా కట్టడిపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు రక్షిత తాగునీరు అందించేలా చూడాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి సుచరిత అత్యాచారం, హత్య జరిగిన ఘటనా స్థలాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. సుచరిత కుటుంబ సభ్యులను హోం మంత్రి అనిత పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక కోసం ఇవాళ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అయితే టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రాగా.. గడువులోగా మరో నామినేషన్ దాఖలు కాలేదు.