Aganampudi Toll Gate: అగనంపూడి టోల్‌గేట్ ఎత్తివేత.. ఇలా స్పందిస్తున్న స్థానికులు..
- విశాఖలోని గాజువాక పరిధిలో ఉన్న అగనంపూడి టోల్గేట్ ఎట్టకేలకు తొలగింపు..
- ఎప్పటి నుండో వివాదాస్పదంగా ఉన్న అగనంపూడి టోల్ గేట్..
- మున్సిపాలిటీ పరిధిలో ఉన్న టోల్ గేట్..
- నిర్వాసిత గ్రామ ప్రజలు టోల్ చార్జీలు కట్టుకోలేక నానా ఇబ్బందు..
- ఇప్పుడు టోల్ గేట్ ఎత్తివేతపై స్థానికుల హర్షం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aganampudi Toll Gate: విశాఖలోని గాజువాక పరిధిలో ఉన్న అగనంపూడి టోల్గేట్ ని ఎట్టకేలకు తొలగించారు.. ఎప్పటి నుండో వివాదాస్పదంగా ఉన్న అగనంపూడి టోల్ గేట్ నుండి రోజు లక్షలాది వాహనాలు రాకపోకలు సాగించేవి.. అటు వర్తకులు, చిరు వ్యాపారులు, ఫార్మా కంపెనీలకు వెళ్లే వాహనాలు ఏడాదికి లక్షలాది రూపాయలు టోల్ ఫీజులు కట్టుకుంటూ వస్తున్నారు.. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ టోల్ గేట్ కు చుట్టుపక్కల ఉన్న నిర్వాసిత గ్రామ ప్రజలు టోల్ చార్జీలు కట్టుకోలేక నానా ఇబ్బందులకు గురయ్యారు.. స్థానికులు ఎంతో కాలం నుంచి మొరపెట్టుకున్నప్పటికీని హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మరీ టోల్ ప్లాజా యాజమాన్యం ఇప్పటివరకు అక్రమ వసూళ్లకు తెగబడిందని ఆరోపించారు..
Read Also: Sengol: పార్లమెంట్లో ‘‘సెంగోల్’’ స్థానంలో రాజ్యాంగం పెట్టాలి.. అఖిలేష్ పార్టీ ఎంపీ డిమాండ్..
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఇక, దాన్ని గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు.. ఈరోజు టోల్ ప్లాజా లో ఉన్న క్యాబిన్లు మొత్తాన్ని తొలగించి ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా మొత్తం టోల్ ప్లాజాని క్లియర్ చేశారు.. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టోల్ గేట్‌ను ఎత్తేసారు స్థానిక నాయకులు.. దీంతో స్థానిక ప్రజలు, ట్రాన్స్‌పోర్ట్ ఓనర్లు ఆనందం వ్యక్తం చేశారు.. ఇన్నాళ్లుగా ప్రతిరోజు రాకపోకలు సాగించే తమకు టోల్ గేట్ ఫీజులు చెల్లించటం తలకు మించిన భారంగా తయారైందని, అలాగే అగనంపూడి తదితర ప్రాంతాల నుంచి స్టీల్ ప్లాంట్ కి వచ్చే ఫోర్ వీలర్స్ సైతం టోల్గేట్ ప్రతిరోజు చెల్లించాల్సి వచ్చేదని వాపోయారు.. రాత్రి కి రాత్రే పూర్తిస్థాయిలో ఈ టోల్ గేట్ తొలగించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!