Hardik Pandya దెబ్బకు సోషల్ మీడియా షేక్.. “No-Look Wicket” అంటూ వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya ‘No-Look’ wicket: కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్‌ను 61 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంలో టర్నింగ్ పాయింట్ అంటే.. పవర్‌ప్లేలో భారత బౌలర్ల దూకుడను నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
Jangaon Municipality: జనగామ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా..
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
కొత్త బంతిని అందుకున్న హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్‌నే మేడిన్ గా పూర్తి చేయడమే కాకుండా.. పాకిస్తాన్ ఓపెనర్ సాహిబీజాడా ఫర్హాన్ ను ఔట్ చేశాడు. మొదటి ఓవర్ నాలుగో బంతికి ఫర్హాన్ పుల్ షాట్ ప్రయత్నించగా.. అది బంతి గాల్లోకి లేచింది. అయితే ఇక్కడే ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాచ్ పూర్తయ్యిందో లేదో చూసేందుకు కూడా వెనక్కి తిరిగి చూడకుండా పాండ్యా ముందుకు నడుస్తూ బ్యాటర్ నే తదేకంగా చూస్తూ ముందుకు నడుస్తూ వచ్చాడు. ఇందుకు సంబంధించిన హార్దిక్ పాండ్యా ఆటిట్యూడ్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
Salman Ali Agha: ఏంట్రా బాబు ఆ మాట్లాడడం.. నవ్వులపాలైన పాకిస్తాన్ కెప్టెన్! వీడియో వైరల్..
రింకు సింగ్ క్యాచ్ పూర్తి చేసిన వెంటనే ఇతర భారత ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయినా.. పాండ్యా మాత్రం పెద్దగా సెలబ్రేట్ చేయకుండా ప్రశాంతంగా కనిపించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు అతని రియాక్షన్‌ను “ఆరా ఫార్మింగ్” (aura farming) అంటూ ప్రశంసిస్తున్నారు. మరికొందరేమో ‘నో-లుక్’ వికెట్ అంటూ పెద్దెత్తున వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం చాటగా.. హార్దిక్ పాండ్యా ‘నో-లుక్’ వికెట్ క్షణం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Hardik Pandya is a legend for a reason
After bowling 3 dot balls for 4th one he dint even bother to see who is catching the ball because after that he knew
Sahibzada Farhan is OUTBrand Vs Cheap product 👇🏽#INDvsPAK pic.twitter.com/3DEsl7uMFQ
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) February 16, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..