Deputy CM Pawan Kalyan: బాధితుల ప్లకార్డు చూసి కాన్వాయ్ ఆపిన పవన్.. న్యాయం చేస్తానని హామీ
- పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం..
- పవన్ వెళ్తున్న రూట్ లో తమకు న్యాయం చేయాలని ప్లకార్డుల ప్రదర్శన..
- కాన్వాయ్ ఆపి.. వాళ్లతో మాట్లాడి పవన్ కల్యాణ్.. న్యాయం చేస్తానని హామీ..
- కొండెవరంలో గత వారం ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ అనే యువకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూటే వేరు.. సమస్య అంటూ తన దగ్గరకు వచ్చిన వారిని అక్కున చేర్చుకుని.. వెంటనే వారి సమస్య పరిష్కారానికి పూనుకుంటారు.. తన దగ్గరకు వచ్చేవారికే కాదు.. దారిలో ఎవరైనా కనిపించినా కాన్వాయ్ ఆపి మరి పలకరిస్తారు.. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించారు.. అయితే, పవన్ వెళ్తున్న రూట్ లో తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు.. కొండెవరంలో గత వారం ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ కుటుంబ సభ్యులు.. వెంటనే కాన్వాయ్ ఆపి.. వాళ్లతో మాట్లాడి పవన్.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
కాగా, యు కొత్తపల్లి మండలం కొండెవరంలో చక్రధర్ అనే యువకుడి ఆత్మహత్య సంచలనంగా మారింది.. 2021లో గ్రామానికి చెందిన మనీషా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న చక్రధర్.. మనీషా మైనర్ కావడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెండు నెలలు జైల్లోనే ఉన్నాడు.. ఆ తర్వాత మనీషాను తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయింది కుటుంబం.. జూన్ 16న మనీషా పుట్టినరోజు సందర్భంగా విషెస్ మెసేజ్ పెట్టాడు చక్రధర్.. ఇక, 22న పరీక్ష రాయడానికి తన అక్క ఇంటికి వచ్చింది యువతి.. అదే రోజు చక్రధర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. 22న ఆదివారం పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లి విచారణ చేసి, తిరిగి సోమవారం రమ్మని చెప్పారు పోలీసులు.. కానీ, ఇంటికి వచ్చి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు చక్రధర్.. పోలీసులు ఇబ్బందులు, మనీషా కుటుంబ సభ్యుల వేధింపుల వల్ల తమకుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చక్రధర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. అయితే, విచారణలో భాగంగానే తీసుకొచ్చామని పోలీసులు చెబుతున్నారు.. మరి ఈ కేసులో ఏం తేలుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?