Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు..
- బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం..
- తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక జారీ..
- తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడే అవకాశం..
- రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణం చల్లబడడమే కాకుండా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. తాజాగా వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపరితల ఆవర్తన గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో ఐదు రోజుల పాటు తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహబూబ్ నగర్, జోగుళాంబ గద్వాల, నల్గొండ, నారాయణపేట్, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మెదక్, జగిత్యాల, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
Read also: Telugu Indian Idol: సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3
Also Read
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
- China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై సాయంత్రం వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీ విషయానికి వస్తే ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఉభయగోదావరి జిల్లాలు, నెల్లూరు, ఏలూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉందని.. చెట్లకింద ఎవరూ ఉండకూడదన్నారు.
Hyderabad Crime: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన.. ట్రైన్ కు వేలాడుతూ మృతదేహం..
తాజావార్తలు
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!