ONGC Gas: రాజోలు నియోజకవర్గ పరిధిలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీ జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ ఘటనపై మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారులతో సీఎం ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. Jolin Tsai: ఓడియమ్మ అనకొండ.. 30 మీటర్ల అనకొండపై పెర్ఫామెన్స్ చేసిన జోలిన్ సాయ్.. వీడియో వైరల్ గ్యాస్ లీకేజీ…
Kurnool Kandhanathi: రాయలసీమలో మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో పాతకక్షలు హింసాత్మకంగా మారాయి. ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వెంకటేష్ అనే వ్యక్తిని పొలంలో, పరమేష్‌ను ఇంట్లో ప్రత్యర్థులు హత్య చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో శివారులో కాపు కాచి గోవింద్ (45), వీరేషమ్మ దంపతులపై వేటకొడవళ్లతో దాడి జరిగింది. Gas Leakage: కోనసీమలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా…
కోనసీమలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజ్ కలకలం సృష్టించింది. ఒ ఎన్ జి సి అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. బ్లో అవుట్ తరహాలో మంటలు కూడా రావడంతో అదుపు చేసేందుకు వెళ్లిన ONGC సిబ్బంది పరుగులు తీశారు. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ONGC బావి వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు జరిగిన క్రమంలో గ్యాస్ పైప్ లైన్ నుంచి ఈ లీకేజ్ సంభవించింది. భారీగా గ్యాస్…
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం.. ఒకరు మృతి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం ఓ ప్రమాదం చోటు చేసుకుంది.. ఎయిరిండియా విమానాల లగేజీ హ్యాండ్లింగ్ పనుల్లో భాగంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సీకే ఆదిత్య ఆనంద్ (27).. ట్రాక్టర్ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.. ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లగేజీని టెర్మినల్ నుంచి ట్రాలీల ద్వారా తరలించే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక…
అనుకూలించని వాతావారణం.. గాల్లో విమానం చక్కర్లు దట్టమైన పొగమంచు రవాణా వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతోంది.. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పొగమంచు కారణంగా.. కొన్ని విమానాలు ఇతర ఎయిర్‌పోర్ట్‌లకు మళ్లించిన విషయం విదితమే కాగా.. కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా.. విమానాలు ల్యాండ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది.. ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్ పోర్టు (గన్నవరం) కు చేరుకోవాల్సిన విమానాలు వాతావరణం అనుకూలించకపోవడంతో గాల్లో చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి…
* ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల జల వివాదాల కేసు విచారణ జరపనున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం.. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కార్.. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ సర్కార్ పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుందని వాదన.. రాజకీయ ఉద్దేశంతోనే కేసు వేసిందని ఏపీ ప్రభుత్వం కేవియట్ * ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ.. హైకోర్టు తీర్పును…
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. అబద్దాలకు అభూత కల్పనలకు ప్యాంటు చొక్కా వేస్తే అది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. నిజానికి, నిలకడకు, నిబద్ధతకు, నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అని కొనియాడారు. మీ అవినీతి కరపత్రికలో ఒక పేజీ అబద్ధాలు అచ్చోసినంత మాత్రాన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మేస్థితిలో లేరు అని చురకలంటించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు…
కృష్ణాజిల్లా అవనిగడ్డలో 2 రోజుల క్రితం మృతి చెందిన 45 రోజుల పసికందు మృతి కేసును పోలీసులు ఛేదించారు. కన్నతల్లి పసిపాపను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న పాప వైద్యానికి ఖర్చు అవుతోందని అత్త సూటి పోటి మాటలు అనడంతో మనస్తాపానికి గురైంది కన్న తల్లి. తన బిడ్డకు అనారోగ్యం నయం కాదేమో అని గుండెలవిసేలా రోదించింది. దీంతో కన్న బిడ్డను చెరువులో పడేసినట్టు పోలీసులు గుర్తించారు. పసి పాప మృతికి కారకులైన…
ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్ క్రిస్ట్ కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక అనుమానాస్పద మృతి చెందింది. త్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న దీపిక ను ఆయుష్ ఆసుపతిలో డిసెంబర్ 31న చేర్చారు కుటుంబ సభ్యులు. డిసెంబర్ 31న స్థానిక ఆయుష్ ఆసుపత్రిలో చేరిన సత్య గీతిక ఇవాళ తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతి పై అనుమానాలు ఉన్నాయని సత్య గీతిక సోదరి సరిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ…
ఏలూరు జిల్లాకు చెందిన బొట్ల కనకరావు సారా అమ్ముతూ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడి నాలుగు రోజులపాటు రిమాండ్ కి వెళ్లి వచ్చాడు. జైలు నుంచి బయటకి వచ్చి తన సొంత గ్రామం ముసునూరు మండలం లోపూడి గ్రామంలో సొంత ఇంటికి వెళ్ళాడు. ఈ క్రమంలో గౌడ కులానికి చెందిన కుల పెద్దలు కనకారావు కుటుంబాన్ని 10రోజుల క్రితం మోకాలు దండ పై నిలబెట్టి పంచాయతీ పెట్టారు. పంచాయతీలో లక్ష రూపాయలు అపరాధ రుసుము విధించారు. కనకారావు కుటుంబం…