Pemmasani Chandrasekhar: అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు ఈ పార్లమెంట్ సమావేశాల్లో కానీ, వచ్చే సమావేశాల్లో గానీ బిల్లు పెడతామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 2014 నుంచి రాజధానిగా గుర్తించాలా.. లేక ఇప్పటి నుంచి గుర్తించాలా అనే సాంకేతిక కారణాలతో ఆలస్యం జరుగుతుంది.
Doctors Negligence: విశాఖపట్నంలోని కేజీహెచ్ లో మరో సారి వైద్యుల నిర్లక్ష్యం బయట పడింది. పీజీ డాక్టర్ల నిర్లక్ష్యనికి శిశువు మృతి చెందింది. వారం రోజుల కిందట కేజీహెచ్ లో అడ్మిట్ అయిన సింహాచలం ప్రాంతానికి చెందిన పి. ఉమా దేవీ అనే గర్భిణీని డెలివరీ సమయంలో జూనియర్ డాక్టర్లు టార్చర్ పెట్టారు.
YCP Leaders House Arrest: గుంటూరు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. టీడీపీ నేతల జంట హత్యల కేసులో మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకట్రామిరెడ్డి.
Kakinada: కాకినాడలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి (జీజీహెచ్) లోని స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో జీఎన్ఎం రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ధర్మ తేజ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది.
Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఈ రోజు నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు కొనసాగనున్నాయి. ప్రతి ఏడాది భవానీల సంఖ్య పెరుగుతుంది. ఇరుముడులను సమర్పించేందుకు మూడు హోమగుండాలను ఏర్పాటు చేశారు.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ( డిసెంబర్ 11న) ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అజెండాలోని పలు కీలక అంశాలపై చర్చించి అనంతరం ఆమోదం తెలపనున్నారు.
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండా ఇదే..! ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రేపు సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అజెండా అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, ప్రభుత్వ నిర్మాణాలు, పెద్ద ప్రాజెక్టుల అమలు వంటి విషయాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రూ.169 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడానికి కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది. ఇది రాష్ట్ర…
కడప మాజీ మేయర్ సురేష్ బాబుకి హైకోర్టు షాక్ కడప మాజీ మేయర్ సురేష్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది.. మాజీ మేయర్ సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మేయర్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) విడుదల చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. రేపు జరగాల్సిన కడప మేయర్ ఎన్నిక కోసం ఈ నెల 4న ఎన్నికల సంఘం నోటిఫికేషన్…