Tirupati Laddu Controversy: తిరుమల హిందువులకు పవిత్రమైన దేవాలయం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల వస్తారు.. అలాంటి తిరుమల లడ్డు కల్తీపై తప్పుడు ప్రచారం దుర్మార్గం.. జగన్ హయాంలో లడ్డులో కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.. జంతువుల కొవ్వుతో లడ్డు తయారు చేశారన్నారు.. తర్వాత ఈ విషయాన్ని రాజకీయం చేశారు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెట్లు కడిగారు.. సిట్ విచారణలో జంతువుల కొవ్వు కలవలేదని తేల్చారు.. నాసిరకం డాల్డా కలిసి ఉండొచ్చన్నారు.. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయ్యొచ్చా అని ప్రశ్నించారు. ఆరోపణలు చేస్తే ఎదుర్కొంటాం.. కానీ దుర్మార్గమైన ఆరోపణలు చేస్తే వెంకన్న నిన్ను క్షమిస్తారా చంద్రబాబు అని అంబాటి రాంబాబు అడిగారు.
Read Also: కేవలం రూ.10,999లకే.. 120Hz డిస్‌ప్లే, 80W సౌండ్‌తో Wobble X-సిరీస్ టీవీలు
అయితే, చంద్రబాబు తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని వైసీపీ నేత రాంబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబు దేవుడిని అడ్డం పెట్టుకుని జగన్ పై కక్ష సాధించాలని చూడడం వల్ల దేవుడికి కోపం వచ్చింది.. తిరుమల, సింహాచలం దేవాలయాల్లో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోవడం ఇప్పుడే చూస్తున్నాం.. పవన్ కళ్యాణ్ నీకు బుర్ర లేదా.. చంద్రబాబు ఏది చెబితే అది నమ్ముతావా అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మాటలు కోటలు దాటతాయి… చేతలు గడప దాటవు అని విమర్శించారు. పవన్ రాజకీయాలకు పనికి రాడు.. చంద్రబాబు తోక పట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు.. రేషన్ బియ్యం అక్రమ రవాణా భారీగా జరుగుతుంది.. చంద్రబాబు, లోకేష్ పక్కన పవన్ సున్నా లాంటి వాడు అని అంబాటి రాంబాబు ఆరోపించారు.