ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. 13 బిల్లులకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది..ఈ బిల్లులను అసెంబ్లీ లో ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీంలో చట్టసరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నాలా చట్టం రద్దు ప్రతిపాదించే చట్టానికి ఆమోదం తెలిపింది కేబినెట్..వైఎస్ ఆర్ తాడిగడప మున్సిపాల్టీ పేరులో వైఎస్ ఆర్ పేరు తొలగిస్తూ చట్ట సవరణ కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితా సవరణ బిల్లుకు ఆమోదం..…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది. ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ డీప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కోరారు. రఘురామ మాట్లాడుతూ.. ఇటీవల కేరళ ప్రభుత్వం మంచి తీసుకొచ్చింది. ఆ పాలసీతో ప్లాస్టిక్ ను నిషేధించడానికి మార్గం సుగమమైందన్నారు. ఏపీలో లిక్కర్ వినియోగం ఏ రేంజ్ లో…
సంచలం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థి అయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. అయేషా మీరా హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి నోటీసులు జారీ చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం..
కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు రాజ్ గోపాల్ రెడ్డి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనడానికి గుంటూరు వచ్చాను. ఈరోజు విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకున్నాను.. నేను ఇక్కడికి బయలుదేరినప్పటి నుండి రాజకీయంగా నా పై దుష్ప్రచారం చేస్తున్నారు.. నేను నిన్ననే మీడియా ముందు క్లారిటీ ఇచ్చాను.. కొంతమంది కావాలని నా ప్రతిష్టను దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేస్తున్నారు.. వాటిని నమ్మకండి.. నేను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోవడం లేదు అన్నారు..
ప్లాస్టిక్ నిరోధానికి మూలాలపై దృష్టి పెట్టాలి.. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్లాస్టిక్ వినియోగంపై అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ప్లాస్టిక్ వల్ల వచ్చే కాలుష్యం పై వివరించారు.. ప్లాస్టిక్ ఉత్పత్తులు అరికట్టాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం.. సచివాలయం మొత్తం ప్లాస్టిక్ నిలిపి వేశాం.. గాజు సీసాల్లో సచివాలయంలో నీటి సౌకర్యం ఏర్పాటు చేశాం అన్నారు.
ఇప్పుడు మూడు రోజులు ముందుగానే.. అంటే, ఈ నెల 27తో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.. ఇక, ఈ నెల 22వ తేదీన అసెంబ్లీలో వ్యవసాయం, 23న శాంతిభద్రతలు, 24న ప్రభుత్వ బిజినెస్‌పై చర్చ సాగనుండగా.. 25న ఆరోగ్యంపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.. మరోవైపు, 26న లాజిస్టిక్స్, ఉపాధి కల్పన, పరిశ్రమలపై చర్చ జరుగుతుంది.. 27న సూపర్ సిక్స్ అమలుపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.. చివరి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముగింపు సందేశం ఇవ్వనున్నారు..
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ - ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అదనంగా మరో రూ.14,200 కోట్ల రుణం తీసుకోనున్నారు.. ఈ అదనపు రుణం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు రూ.14,200 కోట్ల రుణం అందించనున్నాయి ఈ రెండు అంతర్జాతీయ బ్యాంక్‌లు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ.. ఇప్పటికే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్.. ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. ఈరోజు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో.. తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు మర్రి రాజశేఖర్.