డ్రోన్ కెమెరాలతో పేకాటరాయుళ్ల బరతం పడుతున్నారు ఏపీ పోలీసులు. గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నవారిని డ్రోన్ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో డ్రోన్ కెమేరాతో పేకాటరాయుళ్ల ఆట కట్టించారు పోలీసులు. తెనాలి రూరల్ మండలం సంగంజాగర్లమూడిలో కొందరు వ్యక్తులు పేకాట ఆడేందుకు సిద్ధమయ్యారు. రైల్వే ట్రాక్ సమీపంలో చెట్ల పొదల్లో పేకాటరాయుళ్లు అంతా ఒక్కచోటుకి చేరారు. Also Read:Operation Sindoor: ‘‘సిందూర్’’ దెబ్బ గట్టిగానే తాకింది.. పీఓకే నుంచి మకాం మారుస్తున్న…
డబ్బు మాయలో పడి ఎంతటి దారుణాలకైనా తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు. ముఖ్యంగా ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యాలపై చెడు ప్రభావం చూపిస్తున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా విశాఖ నగరంలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పూర్ణమార్కెట్ ఏరియాలో నకిలీ నెయ్యి తయారీ డెన్స్ గుర్తించారు. ముఠా లాడ్జి లలో రూమ్స్…
టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు ముగ్గురు ఎమ్మెల్సీలు. కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరారు. మా రాజీనామాలు ఇప్పటివరకు ఆమోదించలేదన్నారు. రాజీనామాల ఆమోదం కోసం ఆరు నెలలుగా వేచి చూశాం. రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం లేదు. మండలి చైర్మన్ వెనుక ఉండి నడిపించేవారి వల్ల రాజీనామాలు ఆమోదించలేదని మర్రి రాజశేఖర్ తెలిపారు. Also Read:India: సౌదీ అరేబియా వీటిని దృష్టిలో ఉంచుకోవాలి.. పాక్తో రక్షణ ఒప్పందంపై…
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. తిరుపతి టూ రాజమండ్రి.. రాజమండ్రి టూ తిరుపతికి అలయన్స్ ఎయిర్ సర్వీసు ప్రారంభించనున్నది. అక్టోబర్ ఒకటవ తేదీ నుండి సర్వీసులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. వారానికి మూడు రోజులు మాత్రమే విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. వారంలో మంగళ, గురు,శని వారాల్లో సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల 40 ని.లకు రాజమండ్రి నుండి బయలుదేరి11 గంటల 20 నిమిషాలకు తిరుపతి చేరుకుంటారు. ఉదయం 7గంటల 40 నిమిషాలకు తిరుపతిలో…
రేపు పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. 10:40కి మాచర్ల చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. యాదవుల బజారులో స్వఛ్చాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. పారిశుధ్య కార్మికులతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో మొక్కలు నాటనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం ఎస్.కె.బి.ఆర్. కాలేజీ గ్రౌండ్ లో ప్రజావేదికలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సాయంత్రం తిరిగి హెలికాప్టర్ లో ఉండవల్లికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.
వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్లలేదని కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్దామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా టైం ఇస్తామని కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వరు అని వైఎస్ జగన్ మండిపడ్డారు. నేను అసెంబ్లీకి వెళ్లవద్దని ఎవరికీ చెప్పలేదన్నారు. వాళ్ళు మాట్లాడే సమయం ఇవ్వరనే అలాంటి నిర్ణయం తీసుకున్నామని వైఎస్ జగన్ తెలిపారు.
లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి తొలి రోజు కస్టడీ ముగిసింది. 4 గంటలపాటు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం GGH కి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించారు. మిథున్ రెడ్డిని పలు విషయాలపై సిట్ ప్రశ్నించింది. లిక్కర్ స్కాంలో వసూలు చేసిన డబ్బులు మిథున్ రెడ్డి వ్యాపార సంస్థలోకి వెళ్ళటంపై ప్రశ్నించింది. ఐదేళ్ల కాలంలో కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తుల గురించి…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణలో మెజారిటీ ప్రాజెక్టులు నేను ప్రారంభించినవే అని వెల్లడించారు. తొలిసారి అనంతపురంలో రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడం ప్రారంభించామని అన్నారు. ఉపాధి లేక పాలమూరు జిల్లా నుంచి వలసలు వెళ్లేవారు అని గుర్తు చేశారు. ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాకు శ్రీశైలం జలాలు అందించామని తెలిపారు. నల్గొండకు లిఫ్ట్ ద్వారా శ్రీశైలం ఎడమ కాలువ నీళ్లిచ్చామన్నారు.…
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే శ్రీవారికి మొక్కుల చెల్లించి భక్తిపారవశ్యంలో మునిగితేలుతుంటారు. అయితే తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ఓ గుడ్ న్యూస్.. రీసైక్లింగ్ యంత్రంలో వ్యర్థాలు వేస్తే.. ప్రోత్సాహకంగా రూ.5 చెల్లించనున్నారు. తిరుమల యాత్రికుల వసతి సముదాయంలో ప్లాస్టిక్ రిసైక్లింగ్ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. Also Read:Balakrishna : ఉదయభాను కూతుళ్లతో బాలయ్య మామ..…