Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు టీడీపీలో చేరారు. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని అనుకున్నామని, కానీ, మండలి చైర్మన్ తమ రాజీనామాలను ఆమోదించకుండా పక్కన పెట్టారని మర్రి రాజశేఖర్ ఆరోపించారు. దాని వెనుక ఆయనకు ప్రత్యేక అజెండా ఉందని చెప్పారు. టీడీపీలో చేరడం సొంతగూటికి వచ్చినట్లు ఉందన్నారు కల్యాణ్…
Off The Record: చింతలపూడి….. పార్టీ ఏదైనా సరే, వర్గపోరు కామన్‌గా ఉండే అసెంబ్లీ నియోజకవర్గం. ఇన్నాళ్ళు ఈ సమస్యతో టీడీపీ, వైసీపీ మాత్రమే సతమతమైతే… ఇప్పుడు జనసేన వంతు వచ్చింది. ఇటీవల ప్రకటించిన నామినెటెడ్ పోస్టులు గ్లాస్ పార్టీలో చిచ్చు రేపాయట. కష్టపడి పనిచేసినవారికి కాకుండా కాకమ్మకధలు చెప్పినవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ సోషల్ మీడియాలో సొంత పార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు. ఇది మెల్లిగా ముదురుతూ… కుమ్ములాటలకు దారితీసి పార్టీ నేతలు రోడ్డెక్కే స్థాయికి…
ఈ నెల 24వ తేదీన కీలక సమావేశానికి సిద్ధమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమీక్షా సమావేశం జరగనుంది.. సమావేశానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరుకానున్నారు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీ... 11మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ పార్టీకి టెక్నికల్‌గా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే... సభలో నాలుగు పార్టీలు ఉండగా... మూడు కూటమి మిత్రపక్షాలే. ఇక మిగిలి ఉంది మేమే కాబట్టి... మాకు ఆ హోదా కావాలన్నది వైసీపీ డిమాండ్.
"అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్ గారికి నా ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం.." అంటూ ట్వీట్.. ఇక, పవన్ కల్యాణ్ గారికి నా ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం.." అంటూ మరో ట్వీట్ చేశారు బోండా ఉమామహేశ్వరరావు.
తిరుమల పరకామణి విషయంలో మంత్రి నారా లోకేష్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఎక్స్ (ట్విట్టర్)లో లోకేష్ కౌంటర్ గా ట్వీట్ చేసింది వైసీపీ.. "రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు, లోకేష్‌కు ఒక అలవాటుగా మారింది.. వెంకటేశ్వరస్వామి సాక్షిగా అబద్ధాలు, విషప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటే. సిగ్గు, శరం వదిలేసి బరితెగించి విషప్రచారం చేయడంలో ఇద్దరూ హేమాహేమీలు. పరకామణిలో చోరీ విషయంలోనూ చంద్రబాబువి పచ్చి అబద్ధాలు.." అని మండిపడింది వైసీపీ..
నేను వచ్చిన వెంటనే చెత్త తొలగించా.. చెత్త నేతలను కూడా అలాగే తొలగిస్తాను అంటూ రౌడీషీటర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మాచర్లలో ఉండే రౌడీలు, ముఠా నాయకులు ప్రజల ఆస్తులను దోచేశారు. చరిత్రలో ఉన్న డిక్టేటర్లకు పట్టిన గతే వారికి పట్టిందన్నారు.. ఆత్మకూరు బాధితులను ఆదుకునేందుకు కూడా నన్ను రానివ్వకుండా నా ఇంటికి తాళ్లు కట్టారు. ఆరోజే చెప్పా... మీకు ఉరితాళ్లే అని.. మున్సిపల్ ఎన్నికలలో దౌర్జన్యం చేసినప్పుడే చెప్పా ఖబడ్దార్…