ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. దివ్య మంగళ స్వరూపుడై.. రకరకాల రూపాల్లో తనకిష్టమైన వాహనాలపై ఊరేగుతూ అభయాన్ని ప్రసాదిస్తుంటే ఆ భాగ్యాన్ని వర్ణించతరమా?. కేవలం బ్రహ్మోత్సవాలకు మాత్రమే ఆవిష్కృతమయ్యే అద్భుతం ఇది. రేపటి నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. ఇవాళ రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు..
ఇసుక మాఫియా దందాకు ఏడుగురు బలయ్యారు. మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చిన్నారులు అనాథలుగా మారారు. ఇంత జరిగినా ప్రమాదానికి కారకులైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదు. పైగా సిల్లీ రీజన్స్తో కేసు పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకూ నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతోంది.
మరో వాన గండం ఉందంటూ వాతావరణశాఖ అలర్ట్ చేసింది. ఈ నెల 25న తూర్పు మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తాతో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
తిరుపతి GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ ఫొటోలుతో ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు సుభాష్... వాణిజ్య పన్నులశాఖ తిరుపతి ప్రాంతీయ ఆడిట్, ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ (FAC)గా పనిచేస్తున్న ఎస్.సుభాష్ చంద్రబోస్.. రాజధాని అమరావతిపై ఫేస్బుక్లో వివాదాస్పద పోస్టులు పెట్టారు.
OG : ఏపీలో పవన్ ఫ్యాన్స్ కు అలెర్ట్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. 25న తెల్లవారు ఒంటిగంటకు ప్రీమియర్స్ కు పర్మిషన్ ఇస్తూ ఇంతకు ముందు జీవో ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తాజాగా దాన్ని మారుస్తూ మరో జీవో రిలీజ్ చేశారు. 25న తెల్లవారుజాము ఒంటిగంట నుంచి 24న రాత్రి 10 గంటలకు మార్పు చేశారు. అంటే ముందు రోజే…
వైబ్రంట్ విజయవాడ ఉత్సవాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. బెజవాడ దుర్గ గుడి భూముల్లో వైబ్రెంట్ విజయవాడ ఉత్సవ్ పేరుతో వాణిజ్య కార్యకలాపాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు..
Heavy Rains: వందంటే వర్షం.. కురుస్తోంది.. కుండతో పోసినట్టు.. ఆకాశానికే చిల్లు పడిందా.. మేఘాలు పగిలి ఒకేసారి పడిపోయాయా అనే విధంగా వర్షాలు పడుతున్నా్యి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. అత్యధికంగా యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 13 సెంటీమీటర్ల వాన కురిసింది. జనగామ జిల్లా దేవరుప్పలలో 12 సెం.మీ వర్షపాతం రికార్డయింది. మెదక్ జిల్లా అల్లాదుర్గ్లో 10 సెం.మీ వాన కొట్టింది. మేడ్చల్ జిల్లా కీసరలో 10 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా…