AP Power Staff JAC: విద్యుత్ ఉద్యోగుల చర్చలు విఫలమయ్యాయి. రెండున్నర గంటల పాటు జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్తు యాజమాన్యం ఎదుట మొత్తం 29 డిమాండ్లు ఉంచినా, ప్రధాన అంశాలపై స్పష్టత రాలేదని JAC స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైనా ఎటువంటి హామీ లభించలేదని ఆవేదన వ్యక్తమైంది. దాంతో, అక్టోబర్ 15 నుండి సమ్మె యథావిధిగా కొనసాగుతుందని విద్యుత్తు JAC ప్రకటించింది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
మొత్తంగా ఏపీలో విద్యుత్ ఉద్యోగులు సమర భేరి మోగించారు. సంవత్సరంగా కొనసాగుతున్న చర్చలు ఫలితం ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. దాంట్లో భాగంగా ఈ రోజు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్తు ఉద్యోగులు వేలాదిగా తరలివచ్చారు.. ఇక ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయనున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్ రాష్ట్రంపై భారీగా పడనుంది. ప్రజలకి ఇబ్బందులు, కీలక రంగాలు, ముఖ్యమైన సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
Read Also: Why Can’t I Sleep: మీకు నిద్రపట్టకపోడానికి కారణాలు తెలుసా?
వేతనాలు, సర్వీస్ హక్కులు, ప్రమోషన్లు, పెన్షన్ విధానం వంటి కీలక అంశాలతో కూడిన 15 ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని విద్యుత్తు జేఏసీ ప్రభుత్వంతో, విద్యుత్తు యాజమాన్యంతో ఏడాదిగా పలు చర్చలు జరిపింది. అయితే, తాజాగా జరిగిన సమావేశాల్లో కూడా ఏ ఒక్క డిమాండ్‌పై సానుకూల నిర్ణయం రాకపోవడంతో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఏడాది పాటు చర్చలు జరిగినా పరిష్కారం లేకపోవడంతో ఇప్పుడు ఉద్యమమే మార్గంగా ఎంచుకున్నారు. ఈ రోజు ధర్నా చౌక్ లో జరిగిన చలో విజయవాడ కు విద్యుత్ రంగంలోని రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది, కార్మికులు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు. మరోవైపు ఎల్లుండి నుండి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ప్రారంభం కానుంది. ఈ సమ్మెలో సుమారు 80,000 మంది విద్యుత్ సిబ్బంది పాల్గొననున్నారు.వీరిలో 34,600 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 29,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, అలాగే 27,638 మంది పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు ఉన్నారు.