Minister Nara Lokesh: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు హత్యను తీవ్రంగా ఖండించారు మంత్రి నారా లోకేష్.. శ్రీనివాసులు హత్య ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన లోకేష్.. ”కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్లల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది.” అని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్..
Read Also: Hardik Pandya Dating: సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. పిక్స్ వైరల్!
కాగా, కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూర్ గ్రామంలోదారుణం చోటుచేసుకుంది. హోసూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం బహిర్భూమికి వెళ్లిన శ్రీనివాసులను దుండగులు ముందే పథకం ప్రకారం కళ్ళలో కారం కొట్టి వేట కొడవళ్లతో అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనతో హోసూర గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మాజీ సర్పంచ్ పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబుకి ప్రధాన అనుచరుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హోసూరు గ్రామంలో టీడీపీకి మంచి మెజార్టీ రావడం తర్వాత ఈ హత్య జరగడంతో రాజకీయంగా మరే ఇతర కారణాలతో హత్య జరిగి ఉంటుందా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్య జరిగిన స్థలాన్ని ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. క్లూస్ టీం, ఆధారాలనుసేకరించారు. డాగ్ స్క్వాడ్, హత్య జరిగిన ప్రదేశం నుండి హత్య అయిన వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్లితిరిగి హత్య ప్రదేశానికి డాగ్ స్క్వాడ్ చేరుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు పత్తికొండ ఆసుపత్రికి తరలించారు. సాయంత్రంలోపు నిందితులను పట్టుకుంటామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాచర్యలు తీసుకుంటామని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు.
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసిపి మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో… pic.twitter.com/Wc3GxqTjR3
— Lokesh Nara (@naralokesh) August 14, 2024