Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్కి వరద ప్రవాహం రోజురోజుకూ పెరిగిపోతుంది. పులిచింతల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్, పులిచింతల మధ్య క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు వస్తుంది.
Adivasi Divas: ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిపేందుకు ఏపీ సర్కార్ సన్నాహాలు.. విజయవాడలో జరిగే ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర పోలీసులు పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
TTD Anga Pradakshina Tokens: నేడు శ్రీవారి భక్తుల కోసం టీటీడీ అంగప్రదక్షిణ టోకెన్లను జారీ చేనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్ ద్వారా వాటిని రిలీజ్ చేయనున్నారు. ఈ కోటా కింద అందుబాటులోకి తీసుకొచ్చే టికెట్ల సంఖ్య.. 250గా ఉంది. ఈ టికెట్లను పొందిన భక్తులు శనివారం అంటే ఆగస్టు 10న తెల్లవారుజామున అంగ ప్రదక్షిణ చేయవచ్చు అని అధికారులు తెలిపారు.
CM Chandrababu: ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కూటమి నేతలు దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇవాళ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై వైజాగ్ నేతలతో సీఎం భేటీ కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరు ప్రకటించనున్నట్లు సమాచారం.
YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ (శుక్రవారం) నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ శ్రేణుల దాడిలో హత్యకు గురైన పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించేందుకు వెళ్తున్నారు. నేటి ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 10. 15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 10 వేల 960 గ్రామ సచివాలయాలు, 4 వేల 44 వార్డు సచివాలయాలు ఉండగా.. దాదాపు లక్షా 61 వేల మంది గ్రామ, వార్డు సెక్రటరీలు ఉన్నారు. అవసరాలకు అనుగుణంగా గ్రామ, వార్డు సెక్రటరీలను వినియోగించుకునేలా కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం..
సీఎం చంద్రబాబు నాయుడు తనపై అంతులేని అభిమానాన్ని కనబరిచిన సాధారణ కార్యకర్తలను పిలుపించుకుని మాట్లాడిన ఆసక్తిర సన్నివేశం గురువారం సచివాలయంలో చోటు చేసుకుంది. ప్రతిపక్షంలో ఉండగా తాను పర్యటనలకు వెళ్లినప్పుడు నిత్యం తనను అనుసరించి అభిమానాన్ని చూపించిన ఇద్దరు కార్యకర్తలను గుర్తు పెట్టుకుని మరీ పిలిపించుకుని వారితో మాట్లాడారు ఏపీ సీఎం..