CPI Narayana: భారతదేశంలో గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ల వ్యవస్థ.. వారి పాత్ర చాలా దారుణంగా ఉంది అని మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ కుడిభుజంగా అదానీ.. మరోవైపు అదానీ ఇనుప కవచంలాగా మోడీ ఉన్నారని ఆరోపించారు.. సెబీ అనేది ఒక పవర్ ఫుల్ సంస్ధ.. అలాంటి సంస్థ కూడా అదానీకి కొమ్ముకాయడం ఏంటి? అంటూ విమర్శలు గుప్పించారు.. ఇక, ప్రమాదకర స్ధాయికి భారతదేశాన్ని తీసుకెళ్లారని ఆరోపణలు గుప్పించారు.. సెబీ అంశం పై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి సీపీఐ సిద్ధంమైనట్టు వెల్లడించారు.. అవినీతి, అహంభావం పెరిగిపోయాయి.. ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయడం లేదు.. భారతదేశంలో గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ల పాత్ర చాలా దారుణంగా ఉందన్నారు..
Read Also: Saina Nehwal: కామెంట్లు చేయడం ఈజీ.. గేమ్స్ ఆడటం చాలా కష్టం! ఇచ్చిపడేసిన సైనా
మరోవైపు.. రైతుల విషయంలో ఈ ప్రభుత్వం పట్టీ పట్టనట్టు ఉంటోందని విమర్శించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.. ప్రకాశం జిల్లాలో వర్షాభావ పరిస్థితులలో రైతులు నష్టపోయారు.. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా.. అందరికీ ఏదోలా ఇస్తూ… అధికారం ఇచ్చిన రైతులను పట్టించుకోవడం లేదన్నారు.. సీఎం చంద్రబాబుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే పోలవరం మాత్రమే కనిపిస్తోంది… తుంగభద్ర ప్రాజెక్టే కాదు రాష్ట్రంలో ప్రాజెక్టులు అన్నీ దుస్ధితిలో ఉన్నాయన్నారు.. ప్రతీ ప్రాజెక్టు మెయింటెనెన్స్ పై ఒక నివేదిక తెప్పించి, నిర్వహణ కోసం నిధులు వెచ్చించాలని సూచించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.. కాగా, అదానీతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించిన నేపథ్యంలో.. సెబీ చీఫ్ మాధురి పురీ బుచ్ రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) వేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా ప్రజాచైతన్య ఉద్యమం ధర్నాలు చేపట్టాలని నిర్ణయించిన విషయం విదితమే.