Kurnool Crime: కర్నూలు జిల్లాలో పత్తికొండ మండలం హోసూరులో దారుణ హత్య జరిగింది.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. శ్రీనివాసులు వయస్సు 48 ఏళ్లు.. అయితే, తెల్లవారుజామున బహిర్భూమికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు శ్రీనివాసులు.. ఈ సమయంలో ఆయన కళ్లలో కారం కొట్టి గుర్తు తెలియని దండగులు హత్య చేశారు. శ్రీనివాసులు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు శ్రీనివాసులు తీవ్రంగా కృషి చేశారు. గ్రామంలో భారీ మెజార్టీ సాధించారు. శ్రీనివాసులు హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? లేక వ్యక్తిగత కారణాలా? అనేది తేలాల్సి ఉండగా.. ఈ హత్య కేసులో అన్ని కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది.. కాగా, ఆంధప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వరుసగా హత్యలు జరుగుతున్నాయని.. ఇవి ముమ్మాటికి రాజకీయ హత్యలేనంతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఢిల్లీ వరకు వెళ్లి ధర్నా నిర్వహించారు.. ఇదే సమయంలో.. హత్యకు గురైన వాళ్లలో ఎక్కువ మంది టీడీపీ వారే ఉన్నారంటూ.. కూటమి నేతలు చెబుతున్న విషయం విదితమే కాగా.. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు హత్య కలకలం రేపుతోంది.
Read Also: Gemini AI: కొత్త అవతార్‌లో గూగుల్ జెమిని ఏఐ.. మరిన్ని ఫీచర్లతో..