కర్నూలు జిల్లాలో ఉన్న హంద్రీ నదిలో 25 మంది కూలీలు చిక్కుకున్నారు. గోనెగండ్ల మండలం గంజహల్లి, దేవనకొండ మండలం తెర్నెకల్ మధ్య ఉన్న హంద్రీ నదిలో 25 మంది చిక్కుకున్నారు. చిక్కుకున్న వారు గంజిహల్లికి చెందిన వారిగా తెలిసింది.
ఏపీలో భారీ విస్తరణకు హెచ్‌సీఎల్ సన్నాహాలు చేస్తోంది. మరో 15 వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తోంది. మంత్రి నారా లోకేష్‌తో హెచ్‌సీఎల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ ఎత్తున విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్‌కు హెచ్‌సీఎల్ ప్రతినిధులు వివరించారు.
వెలుగొండ ప్రాజెక్టు పటిష్టతపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెలుగొండ హెడ్ రెగ్యులెటర్ పనుల్లో నాణ్యత లేదని మంత్రి నిమ్మల మండిపడ్డారు. గత ప్రభుత్వంలో చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులెటర్ ప్రాజెక్టు పనుల్లో నాణ్యత సరిగా లేదని ఆయన విమర్శించారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో వీవీ ప్యాట్లల్లో ఓట్లు సరిపోల్చాలని మాక్ పోలింగ్ వద్దని బాలినేని పిటిషన్ వేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి తరఫు న్యాయవాది ఇవాళ వాదనలు వినిపించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్వాగతం పలికారు.
రాయలసీమ జిల్లాల్లోని ఏ ఒక్క రైతు ఆదాయం తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సీమ జిల్లాల్లో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో సాగు ప్రోత్సహించడంతో పాటు రైతులకు మేలు చేకూర్చేందుకు 80 శాతం రాయితీపై విత్తనాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో వంద రోజుల్లో 1.20 లక్షల ఇళ్లు, రాబోయే రోజుల్లో 7 లక్షల ఇళ్ల నిర్మాణమే మా లక్ష్యమని ఏపీ గృహనిర్మాణి, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. గృహనిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టామని, మైలవరంలో ఇళ్ల స్థలాల అంశంలో ఇబ్బందికర పరిస్ధితులు ఉన్నాయన్నారు.
టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మున్సిపల్, టౌన్ ప్లానింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ కీలక సమావేశం నిర్వహించారు.