ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియామకమయ్యారు. ఫ్లోర్ లీడర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌కు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి లేఖ రాశారు. బొత్సను శాసనమండలి పక్ష నేతగా నిర్ణయిస్తూ పార్టీ నుంచి అధిష్ఠానం లేఖ ఇవ్వనుంది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఓ ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సెచ్‌లోని ఎసెన్సియా కంపెనీలో బుధవారం ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 18 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. రియాక్టర్ పేలుడుతో భారీగా మంటలు చెలరేగాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ రోజు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ మోషేన్‌రాజు తన చాంబర్లో.. బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. కాగా, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 5 బిలియన్ల యూఎస్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ ఇన్వెస్టింగ్ సంస్థ బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీ ప్రమోట్ చేసిన క్లీన్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్ ఎవ్రెన్ ముందుకొచ్చింది. బ్రూక్‌ఫీల్డ్ , యాక్సిస్ యాజమాన్య బృందం.. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో దశలవారీగా 3500 మెగావాట్ల సోలార్ , 5500 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎవ్రెన్…
ఈ రోజు హోం శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశానికి హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమల రావు, హోంశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా.. 2014-19తో పోల్చితే 2019-24 మధ్య క్రైం రేటు 46. 8 శాతం పెరిగిందని సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు.. మహిళలపై నేరాలు 36 శాతం, పిల్లలపై క్రైం 152 శాతం, మిస్సింగ్ కేసెస్ 84 శాతం, సైబర్ క్రైం నేరాలు 134…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు.. జోగి రమేష్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వడం ఇది మూడోసారి.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని జోగి రమేష్‌కు ఇచ్చిన తాజా నోటీసుల్లో పేర్కొన్నారు మంగళగిరి పోలీసులు.