TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి.. రోజుల తరబడి వేచిచూసే అవసరం లేకుండా.. టీటీడీ వివిధ సేవలు, దర్శనానికి సంబంధించిన టికెట్లనో ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న విషయం విదితమే కాగా.. నవంబర్ కోటాకు సంబంధించిన వివిధ టికెట్లను విడుదల చేస్తూ.. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త చెబుతూ వస్తున్న టీటీడీ.. ఈ రోజు ఆన్‌లైన్‌లో నవంబర్ నెల దర్శన టికెట్లు విడుదల చేయబోతోంది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేసేందుకు సిద్ధమైంది టీటీడీ.. తిరుమల, తిరుపతిలో నవంబరు నెల గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
Read Also: Congress: టీపీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణపై త్వరలోనే అధికారిక ప్రకటన
మరోవైపు.. ఈ నెల 27వ తేదీన శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.. ఈ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునే వెలుసులుబాటు ఉన్న విషయం విదితమే.. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది.. ఇక, నిన్న శ్రీవారిని 69,098 మంది భక్తులు దర్శించుకోగా.. 34,707 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.3.56 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.