ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఘరానా మోసానికి తెరలేపాడు ఓ కేటుగాడు. పోలీసునని చెప్పి డబ్బులు అవసరమని తనకు ఫోన్ పే చేస్తే కానిస్టేబుల్ ద్వారా క్యాష్ పంపిస్తానని వ్యాపారులను నమ్మబలికి బురిడీ కొట్టించాలనుకున్నాడు. అయితే వ్యాపారస్తులు చాకచక్యంగా ప్రవర్తించడంతో కేటుగాడి వలకు చిక్కలేదు.
ఈ రోజు కీలక శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యారణం శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు.. రాష్ట్రంలో చేపట్టబోతున్న నరేగా పనులు, ఈ నెల 23వ తేదీన గ్రామసభల నిర్వహణపై ముఖ్యంగా సమీక్షించను్నారు..
అనకాపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బాలల సంక్షేమ సంస్థలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు అదేశాలు జారీ చేశారు.. హాస్టళ్లు, సంక్షేమ సంస్థలు నడిపేందుకు అనుమతులు ఉన్నాయా? లేదో? చూడాలని కలెక్టర్లకు సూచించారు సీఎం.. ఆయా సంస్థలు నిర్వహిస్తున్న భవనాలు సురక్షితమా కాదా అన్న కోణంలోనూ తనిఖీ చేయాలని స్పష్టం చేశారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మళ్లీ సర్వీసులోకి వచ్చే ఆలోచనలో ఉన్నారట.. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకున్నారు ప్రవీణ్ ప్రకాష్.. ఇక, ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేశారు. వీఆర్ఎస్ సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు..
ఏపీ చిన్నతరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డ్వాక్రా మహిళల ద్వారా చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటు చేయించే అంశంపై చర్చించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళికల సిద్ధం చేస్తోంది.
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్కాన్ సంస్థ ముందుకొచ్చింది. సోమవారం ఫాక్స్కాన్ ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉ్న అవకాశాలను వివరించారు. వి లీ నేతృత్వంలోని ఫాక్స్కాన్ సీనియర్ ప్రతినిధి బృందంతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై సమన్వయంతో పని చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు.